Sunday, February 8, 2026
Homeచిత్ర ప్రభAllu Arjun: అల్లు అర్జున్‌కు క‌థ చెప్పిన మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్

Allu Arjun: అల్లు అర్జున్‌కు క‌థ చెప్పిన మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్

Allu Arjun: పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బ‌న్నీతో సినిమా చేయ‌డానికి టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన టాప్ డైరెక్ట‌ర్లు రెడీ అయ్యారు. కానీ వారిని కాద‌ని కోలీవుడ్ ద‌ర్శ‌కుడు అట్లీకి ఛాన్స్ ఇచ్చారు బ‌న్నీ. అట్లీ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే త‌న నెక్స్ట్ మూవీని కూడా త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అల్లు అర్జున్‌. బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇటీవ‌ల వ‌చ్చింది.

- Advertisement -

కాగా అట్లీ, లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో పాటు మ‌రో కోలీవుడ్ డైరెక్ట‌ర్‌కు బ‌న్నీ ఛాన్స్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జైల‌ర్ ఫేమ్ నెల్స‌న్ కూడా బ‌న్నీకి ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ విష‌యాన్ని టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. కోదండ‌రామిరెడ్డి త‌న‌యుడు యాక్ట‌ర్ సునీల్ రెడ్డి ద్వారా బ‌న్నీని క‌లిసిన నెల్స‌న్ ఇటీవ‌ల ఓ క‌థ వినిపించాడ‌ట‌. త‌న‌దైన మార్కు యాక్ష‌న్‌, కామెడీ అంశాల‌తో బ‌న్నీ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా ఓ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను నెల్స‌న్ రెడీ చేశాడ‌ట‌. నెల్స‌న్ చెప్పిన పాయింట్‌కు బ‌న్నీ ఇంప్రెస్ అయిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి రావ‌డానికి మాత్రం టైమ్ ప‌డుతుంద‌ని అంటున్నారు. అట్లీ‌, లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాలు పూర్త‌యిన త‌ర్వాతే బ‌న్నీ, నెల్స‌న్ ప్రాజెక్ట్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ను కాద‌ని వ‌రుస‌గా ముగ్గురు కోలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు బ‌న్నీ ఛాన్స్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read- Anveshi Jain: అన్వేషి జైన్ స్టన్నింగ్ గ్లామర్ లుక్స్

ప్ర‌స్తుతం అట్లీ మూవీ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. సైంటిఫిక్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌దుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. 2027 మార్చిలో ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

బ‌న్నీ, లోకేష్ క‌న‌గ‌రాజ్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మొద‌లుకాబోతుంది. సూప‌ర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read- Tammareddy Bharadwaj: ఇండస్ట్రీ వంద శాతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. చిరుకి కౌంటర్!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News