Friday, January 16, 2026
Homeచిత్ర ప్రభPrabhas RajaSaab: జ‌న‌నాయ‌గ‌న్ వాయిదా... ప్ర‌భాస్ రాజాసాబ్‌కు క‌లిసిరానుందా?

Prabhas RajaSaab: జ‌న‌నాయ‌గ‌న్ వాయిదా… ప్ర‌భాస్ రాజాసాబ్‌కు క‌లిసిరానుందా?

Prabhas RajaSaab: ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల్ల వాయిదా ప‌డ‌టం కోలీవుడ్ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. జ‌న‌నాయ‌గ‌న్‌కు ఇప్ప‌టివ‌ర‌కు సెన్సార్ నుంచి క్లియ‌రెన్స్ రాలేదు. సెన్సార్ జాప్యంపై నిర్మాత‌లు కోర్టును ఆశ్ర‌యించారు. బుధ‌వారం నిర్మాత‌ల పిటీష‌న్‌ను విచారించిన కోర్టు… తీర్పును మాత్రం శుక్ర‌వారానికి వాయిదా వేసింది. శుక్ర‌వార‌మే జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కావాల్సివున్న నేప‌థ్యంలో కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మేక‌ర్స్ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. అనివార్య ప‌రిస్థితుల వ‌ల్ల ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేస్తున్నామంటూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌ చేశారు.

- Advertisement -

జ‌న‌నాయ‌గ‌న్‌కు పోటీగా జ‌న‌వ‌రి 9న ప్ర‌భాస్ రాజాసాబ్ కూడా రిలీజ్ కాబోతుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ సినిమా వ‌ల్ల త‌మిళ‌నాడులో రాజాసాబ్‌కు చాలా త‌క్కువ థియేట‌ర్లు దొరికాయి. ఓవ‌ర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ విష‌యంలో రాజాసాబ్‌ను మాత్ర‌మే కాకుండా మిగిలిన సంక్రాంతి సినిమాల‌ను దాటేసి టాప్ ప్లేస్‌లో ఉంది. జ‌న‌నాయ‌గ‌న్ పోస్ట్‌పోన్ కానుండ‌టం సంక్రాంతి సినిమాల‌న్నింటికి ప్ల‌స్ పాయింట్‌గా మారింది. మిగిలిన సినిమాల‌న్నింటికంటే ప్ర‌భాస్ రాజాసాబ్‌కు జ‌న‌నాయ‌గ‌న్ పోస్ట్‌పోన్ ఎక్కువ‌గా క‌లిసివ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Also Read – Pragya Jaiswal: పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న అఖండ బ్యూటీ!

జ‌న‌నాయ‌గ‌న్‌తో పోటీ కార‌ణంగా త‌మిళ‌నాడులో రాజాసాబ్‌కు వంద లోపే థియేట‌ర్లు దొరికాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ పోస్ట్‌పోన్‌తో ఈ స్క్రీన్స్ సంఖ్య డ‌బుల్ అయ్యింది. 200ల‌కుపైగానే థియేట‌ర్ల‌లో త‌మిళ‌నానాడులో రాజాసాబ్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ చెప్పారు. జ‌న‌నాయ‌గ‌న్‌కు కేటాయించిన చాలా థియేట‌ర్ల‌లో రాజాసాబ్‌ను స్క్రీనింగ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో కూడా జ‌న‌నాయ‌గ‌న్ పోస్ట్‌పోన్ వ‌ల్ల రాజాసాబ్ క‌లెక్ష‌న్స్ భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అక్క‌డ కూడా జ‌న‌నాయ‌గ‌న్ విడుద‌ల కావాల్సిన థియేట‌ర్లు అన్నింటిలో రాజాసాబ్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేద‌ని టాక్ వినిపిస్తోంది. తాజా ప‌రిణామాల వ‌ల్ల‌ రాజాసాబ్‌కు ఓవ‌ర్‌సీస్‌తో పాటు త‌మిళ‌నాడులో అనుకున్న‌దాని కంటే ఎక్కువే ఓపెనింగ్స్ రావ‌చ్చున‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా జ‌న‌నాయ‌గ‌న్‌కు కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే జ‌న‌నాయ‌గ‌న్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది కూడా ఉత్కంఠ‌గా మారింది. జ‌న‌వ‌రి 14ను మ‌రో ఆప్ష‌న్‌గా మేక‌ర్స్ ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు ఇదే డైట్ ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Also Read – Tamannah : నిమిషానికి కోటి… మిల్కీ బ్యూటీ అంటే లెక్క అలాగే ఉంటుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News