Thalapathy Vijay : దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). విజయ్ 69వ సినిమాగా రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
సెన్సార్ వివాదం , న్యాయపోరాటం
నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరాల వల్ల ఈ చిత్రం నిలిచిపోయింది. చిత్రంలోని కొన్ని డైలాగ్స్ , సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని, ముఖ్యంగా సాయుధ బలగాలను (Armed Forces) తక్కువ చేసి చూపేలా ఉన్నాయనే ఆరోపణలతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ నిలిపివేసింది. ఈ విషయంపై నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయపోరాటం కొనసాగుతోంది. కోర్టు ఇచ్చే తీర్పుపైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Shambala OTT: ఓటీటీలో ఆది సాయికుమార్ ఊచకోత.. 11 రోజుల్లోనే 100 మిలియన్ల మార్క్!
నిర్మాతల కొత్త నిర్ణయం – 20 నిమిషాల కట్?
సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు అభ్యంతర వ్యక్తం చేసిన సుమారు 20 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించడానికి, అలాగే కొన్ని రాజకీయంగా సున్నితమైన డైలాగ్స్‌ను మ్యూట్ చేయడానికి మేకర్స్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మార్పుల తర్వాత సినిమాను మరోసారి సెన్సార్ స్క్రూటినీకి పంపారు. ఒకవేళ బోర్డు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
విడుదల తేదీపై ఉత్కంఠ
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు కృతనిశ్చయంతో ఉన్నారు. సెన్సార్ అడ్డంకులు త్వరగా తొలగిపోతే, ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ న్యాయపరమైన ప్రక్రియ ఆలస్యమైతే, ఫిబ్రవరి చివరి వారంలో సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఆర్థిక ఇబ్బందుల్లో నిర్మాణ సంస్థ
‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటం వల్ల KVN ప్రొడక్షన్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపైనే సంస్థ తదుపరి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. సినిమా ఎంత త్వరగా విడుదలవుతే ఆ సంస్థకు అంత ఊరట లభిస్తుంది. మరోవైపు, ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సినిమా విడుదల కావడం విజయ్ రాజకీయ ప్రయాణానికి (TVK పార్టీ) అత్యంత కీలకం కానుంది.
Grammy 2026: గ్రామీ వేదికపై రాజకీయ రణరంగం.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తారల నిరసన!

