Sunday, January 18, 2026
Homeచిత్ర ప్రభJanhvi Kapoor: జాన్వీ క‌పూర్ మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ - ఫ‌స్ట్ డేనే థియేట‌ర్లు మొత్తం...

Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ మూవీకి షాకింగ్ క‌లెక్ష‌న్స్ – ఫ‌స్ట్ డేనే థియేట‌ర్లు మొత్తం ఖాళీ – ఇలా అయితే క‌ష్ట‌మే!

Janhvi Kapoor: జాన్వీ క‌పూర్ లేటెస్ట్ మూవీ ప‌ర‌మ్ సుంద‌రికి తొలిరోజే పెద్ద షాక్ త‌గిలింది. శుక్ర‌వారం రిలీజైన ఈ సినిమాకు చాలా చోట్ల ఆడియెన్స్ లేక థియేట‌ర్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. మొద‌టిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ ప‌ర‌మ్ సుంద‌రి రూ. 7.25 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది.. ఫ‌స్ట్ డే ఆక్యుపెన్సీ రేటు 12.92 మాత్ర‌మే ఉండ‌టం గ‌మ‌నార్హం. మార్నింగ్ షోస్‌కు ఎనిమిది శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీ ఉంది.

- Advertisement -

ఫ‌స్ట్ డే లోయెస్ట్ క‌లెక్ష‌న్స్‌…
ఈ ఏడాది బాలీవుడ్‌లో ఫ‌స్ట్ డే లోయెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా ప‌ర‌మ్ సుంద‌రి నిలిచింది. విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన ఛావా మూవీ తొలి రోజు 29 కోట్ల‌తో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఎన్టీఆర్ వార్ 2 హిందీ వెర్ష‌న్ 28 కోట్ల‌తో సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతుంది. సికింద‌ర్ (25 కోట్లు), హౌస్‌ఫుల్ 5 (21 కోట్లు), సైయారా (20కోట్లు) 2025లో హ‌య్యెస్ట్ ఫ‌స్ట్‌డే ఓపెనింగ్స్ ద‌క్కించుకున్న టాప్ ఫైవ్ మూవీస్ లిస్ట్‌లో ఉన్నాయి.

Also Read- OG Movie: ఓజీలో ఛాన్స్ కొట్టేసిన డీజే టిల్లు హీరోయిన్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స్పెష‌ల్ సాంగ్‌!

దేవ‌రకు ద‌రిదాపుల్లో కూడా…
జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ దేవ‌ర ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. దేవ‌ర‌కు ద‌రిదాపుల్లో కూడా ప‌ర‌మ్ సుంద‌రి నిల‌వ‌లేక‌పోయింది.

వివాదాల‌తో…
విడుద‌ల‌కు ముందు అనేక వివాదాల‌తో ప‌ర‌మ్ సుంద‌రి మూవీ వార్త‌ల్లో నిలిచింది. ఈ రొమాంటిక్ మూవీలో మ‌ల‌యాళ అమ్మాయిగా జాన్వీని చూపించిన తీరుతో పాటు ఓ ప్రార్ధ‌న స్థ‌లంలో హీరోహీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ సీన్లు షూట్ చేయ‌డంలో అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఈ కాంట్ర‌వ‌ర్సీల‌తో పాటు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, జాన్వీక‌పూర్‌కు బాలీవుడ్‌లో ఉన్న‌ క్రేజ్ కార‌ణంగా ఫ‌స్ట్ డే ప‌ర‌మ్ సుంద‌రి మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ ఔట్‌ డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. ప‌ర‌మ్ సుంద‌రి మూవీకి తుషార్ జ‌లోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దాదాపు 50 కోట్ల బ‌డ్జెట్‌తో మ‌డోక్ ఫిల్స్మ్ ప‌తాకంపై దినేష్ విజ‌న్ ఈ మూవీని నిర్మించారు.

ప‌ర‌మ్ సుంద‌రి స్టోరీ ఏంటంటే?
ఢిల్లీ అబ్బాయి…కేర‌ళ అమ్మాయి ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు తుషార్ ఈ మూవీని రూపొందించారు. ప‌ర‌మ్ స్టార్ట‌ప్ కంపెనీలో డ‌బ్బులు పెట్టి న‌ష్ట‌పోతాడు. తండ్రి పెట్టిన ఓ కండీష‌న్ వ‌ల్ల కేర‌ళ వెళ‌తాడు. అక్క‌డ సుంద‌రి అనే అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. సుంద‌రి కూడా ప‌ర‌మ్‌ను ప్రేమిస్తుంది. కానీ వేణు నాయ‌ర్ అనే అబ్బాయితో సుంద‌రి పెళ్లిని పెద్ద‌లు ఫిక్స్ చేస్తారు? ఆ త‌ర్వాత ఏమైంది? ప‌ర‌మ్‌, వేణుల‌లో సుంద‌రి ఎవ‌రిని పెళ్లి చేసుకుంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌. నువ్వునాకు న‌చ్చావ్, చెన్నై ఎక్స్‌ప్రెస్‌, టూ స్టేట్స్ తో పోలిక‌లు రావ‌డం ఈ మూవీకి మైన‌స్‌గా మారింది.

Also Read- Anchor Vishnu Priya: హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్న విష్ణు ప్రియ

దేవ‌ర త‌ర్వాత తెలుగులో రామ్‌ చ‌ర‌ణ్‌తో పెద్ది మూవీ చేస్తోంది జాన్వీక‌పూర్‌. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News