Monday, November 17, 2025
HomeTop StoriesParam Sundari: ఓటీటీలోకి జాన్వీక‌పూర్ రొమాంటిక్ కామెడీ మూవీ - రిలీజ్ డేట్ క‌న్ఫామ్‌!

Param Sundari: ఓటీటీలోకి జాన్వీక‌పూర్ రొమాంటిక్ కామెడీ మూవీ – రిలీజ్ డేట్ క‌న్ఫామ్‌!

Param Sundari: జాన్వీ క‌పూర్ కెరీర్‌లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ‌గా ఉన్నాయి. అయినా బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలో జాన్వీక‌పూర్‌కు ఆఫ‌ర్లు భారీగానే వ‌స్తున్నాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన మూడు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. ప‌ర‌మ్ సుంద‌రితో పాటు హోమ్ బౌండ్‌, స‌న్నీ సంస్కారి కి తుల‌సీ కుమారితో ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించింది జాన్వీక‌పూర్‌. హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రిలీజైన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచాయి.

- Advertisement -

ఓటీటీలోకి…
కాగా జాన్వీక‌పూర్ రొమాంటిక్ కామెడీ మూవీ ప‌ర‌మ్ సుంద‌రి ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబ‌ర్ 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. తొలుత రెంట‌ల్ విధానంలో విడుద‌ల అవుతున్న‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ 24 నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు టాక్ వినిపిస్తుంది.

Also Read- Tejaswini: కెమెరా ముందుకు బాల‌కృష్ణ చిన్న కూతురు – నంద‌మూరి ఫ్యామిలీలో ఫ‌స్ట్ టైమ్‌!

కొత్త‌ద‌నం మిస్‌…
ప‌ర‌మ్ సుంద‌రి సినిమాలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టించాడు. తుషార్ జ‌లోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆగ‌స్ట్ 29న ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. నార్త్ ఇండియ‌న్ అబ్బాయికి, కేర‌ళ అమ్మాయికి మ‌ధ్య మొద‌లైన ప్రేమాయ‌ణం ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, జాన్వీక‌పూర్ కెమిస్ట్రీ, యాక్టింగ్ ఆక‌ట్టుకున్నా క‌థ‌లో కొత్త‌ద‌నం మిస్స‌య్యింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్‌తో పాటు కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేదంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌చ్చాయి. రిలీజ్‌కు ముందు త‌లెత్తిన వివాదాల కార‌ణంగా ప‌ర‌మ్ సుంద‌రి మూవీకి ఓపెనింగ్స్ మాత్రం భారీగానే వ‌చ్చాయి. ప్రార్ధ‌న స్థ‌లంలో రొమాంటిక్ సీన్స్ షూట్ చేయ‌డం, మ‌ల‌యాళీ అమ్మాయిగా జాన్వీ లుక్‌, యాస విష‌యంలో కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. పోలీస్ కేసుల‌ వ‌ర‌కు ఈ వివాదం వెళ్లింది. ఈ కాంట్ర‌వ‌ర్సీతోనే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వ‌చ్చింది.

ప‌ర‌మ్ సుంద‌రి క‌థ ఏంటంటే?
ఢిల్లీకి చెందిన ప‌ర‌మ్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా) ఓ స్టార్ట‌ప్ కంపెనీ పెట్టి లాస్ అవుతాడు. తండ్రి కండీష‌న్ వ‌ల్ల అనుకోని ప‌రిస్థితుల్లో కేర‌ళ వెళ‌తాడు. అక్క‌డి మ‌ల‌యాళ అమ్మాయి సుంద‌రితో (జాన్వీక‌పూర్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు ప‌ర‌మ్‌. సుంద‌రికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకునే టైమ్‌లోనే వేణు నాయ‌ర్ అనే అబ్బాయితో పెద్ద‌లు ఆమెకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ త‌ర్వాత ఏమైంది? సుంద‌రి పెళ్లి ప‌ర‌మ్‌, వేణుల‌లో ఎవ‌రితో జ‌రిగింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Also Read- Bigg Boss Telugu 9 Immunity Task : ఇమ్యునిటీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ విజయం.. నామినేషన్స్ నుంచి సేఫ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News