Jani Master| ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు లైంగిక ఆరోపణల కేసులో బెయిల్ వచ్చింది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. తాజాగా నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జైలు నుంచి జానీ విడుదల కానున్నారు.
కాగా తనపై అత్యాచారం చేశారంటూ జానీపై ఆయన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మధ్యలో ఓసారి కస్టడీకి తీసుకున్న పోలీసులు జానీని విచారించారు.
అనంతరం నేషనల్ అవార్డ్ తీసుకోవడానికి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో నేషనల్ అవార్డును జాతీయ చలనచిత్ర కమిటీ రద్దు చేసింది. దీంతో న్యాయస్థానం బెయిల్ నిర్ణయం కూడా వెనక్కి తీసుకుంది. అయితే మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో తాజాగా బెయిల్ మంజూరు చేసింది.