జేడీ చక్రవర్తి గుర్తున్నాడా? చాలాకాలం తర్వాత మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మళ్లీ తెరమీదకు వస్తున్నారు. జాతస్య మరణం ధ్రువం అనే ప్యాన్ ఇండియా సినిమాతో వస్తున్న జేడీ ఫస్ట్ లుక్ లో ఎవర్ యంగ్ గా కనిపిస్తుండటం హైలైట్.
- Advertisement -
యాక్షన్ థ్రిల్లర్ గా
జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ కూడా రీఎంట్రీ ఇస్తుండటం మరో హైలైట్.
JD చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తూ మిస్టరీ సెన్స్ ని క్రియేట్ చేసే ఫస్ట్-లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.