JD Chakravarthy: నటుడు జేడీ చక్రవర్తి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నాడు. వరుస ఇంటర్య్వూలలో నటీనటులపై తన అభిప్రాయాలు పంచుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పాడ్ కాస్ట్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో జేడీ చక్రవర్తి టాలీవుడ్ అగ్ర హీరో సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అయితే ఆ హీరో పేరు రివీల్ చేయకుండానే ఆయన గురించి చెప్పడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ.. మనం అభిమానించే వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలియకుండానే గౌరవం పెంచుకుంటాం. నిజం చెప్పాలంటే అది పొరపాటు. ఎందుకంటే నాకు నాకు ఓ నటుడి వల్ల ఎదురైన సంఘటన నా అభిప్రాయం మారింది. ఆయన ఒక పెద్ద నటుడు. ఆయనంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. కానీ, అతని పేరు మాత్రం చెప్పను. ఆ హీరో అంటే నాకు మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతమైన గౌరవం ఉంది. మొత్తం ఇండియా వైడ్ గా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఇమేజ్ చూసి నిజ జీవితంలో ఉంటారని అనుకున్నాను. దాంతో ఆయనపై నాకు గౌరవం పెరిగింది. ఒక సినిమా టైం ఆయన సెట్స్‌కు ఆలస్యంగా వస్తారు సార్ అని కొందరు నాతో చెప్పారు.
ఎందుకు? అడిగాను. రాత్రి తాగింది దిగలేదన్నారు. నేను షాక్ అయ్యా. నిజమా..! ఆయన తాగుతారా? అని ప్రశ్నించాను. ఆయనకు అప్పటికే వయసు అయిపోయింది. హోటల్‌లో కూడా ఉండరు. ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉంటున్నారని చెప్పడంతో ఆయనకు పెళ్లైంది కదా అన్నాను. లేదు గర్ల్‌ఫ్రెండ్‌తోనే ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు వరకు ఆయనకున్న ఇమేజ్‌ను బట్టి నేను కూడా మహానుబావుడు అనుకున్నాను. కానీ, అని రియాలిటీ్కి వచ్చేసరికి మరోలా ఉంటుంది‘ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఆ హీరో ఎవరా? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
Huge controversy!!!! pic.twitter.com/NZCOl6wIzn
— Cinema Madness 24*7 (@CinemaMadness24) April 29, 2026

