Homeచిత్ర ప్రభThaai Kizhavi OTT: ఓటీటీకి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Thaai Kizhavi OTT: ఓటీటీకి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

Thaai Kizhavi OTT: సీనియర్‌ నటి రాధిక శరత్ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘తాయ్‌ కిళవి’ (Thaai Kizhavi). శివకుమార్‌ మురుగేషన్‌ దర్శకత్వంతో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ మూవీ కోలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించింది. కేవలం రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వరల్డ్‌ రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

- Advertisement -

ఫ్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి హీరో శివకార్తికేయన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వృద్ధురాలిగా రాధిక శరత్‌ కుమార్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విడుదల అనంతర ఊహించని రెస్పాన్స్‌తో భారీ విజయం సాధించింది. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కి సంబంధించిన ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో హాట్‌స్టార్‌ ఈ చిత్రాన్ని డిజిటల్‌ రైట్స్‌ని సొంతం చేసుకుంది.

మూవీ విడుదలైన నెల రోజులు దాటిన సందర్భంగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ ఇచ్చేందుకు జియో హాట్‌స్టార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ‘తాయ్‌ కిళవి’ స్ట్రీమింగ్‌కి ఇస్తున్నట్టు జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌పై క్లారిటీ లేదు. కేవలం తమిళంలోనే విడుదల అవుతుంది. లేక ఇతర సౌత్‌ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

కథేంటంటే..
తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన పవునుత్తాయి (రాధిక) వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఊరిలో ఏం జరిగినా తన మాటే చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఆమె పక్షవాతానికి గురవుతుంది. వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఆమె ముగ్గురు కొడుకులు విషయం తెలిసి ఊరికి వస్తారు. తల్లి వద్ద 160 సవర్ల బంగారు నగలు ఉన్నాయని వారికి తెలుస్తుంది. వాటిని తమ సొంతం చేసుకునేందకు వారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు?అసలు ఆ నగలు ఉన్నాయా? కల్పితమా? అన్నది ఈ మూవీ కథ.

Also Read: Kushboo Sundar: అది నిజం కాదు.. ఎవరూ నమ్మకండి: ఖుష్బూ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News