Homeచిత్ర ప్రభJr NTR Look: ఆందోళన కలిగిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌.. నీల్‌ మావ ఏం ప్లాన్‌ చేస్తున్నావ్‌!

Jr NTR Look: ఆందోళన కలిగిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌.. నీల్‌ మావ ఏం ప్లాన్‌ చేస్తున్నావ్‌!

Jr NTR Look: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్ కొత్త లుక్‌ కొంతకాలంగా ఆయన అభిమానులను కలవర పెడుతోంది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య ఎన్టీఆర్‌ బాగా బక్క చిక్కిపోయి కనిపించిన సంగతి తెలిసిందే. అంతగా సన్నగా అవ్వడం వెనక కారణమేంటాని ఆరా తీస్తున్నారు. అయితే ఇది ప్రశాంత్‌ నీల్‌ ది ప్రశాంత్‌ నీల్‌ మూవీ కోసమే అని తెలిసిన.. ఆయన డ్రాస్టిక్‌ చేంజ్ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ గా మారింది.

- Advertisement -

భారీ యాక్షన్‌, థ్రిల్లర్‌
ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ యాక్షన్‌, థ్రిల్లర్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్టీఆర్‌ తన లుక్‌ని మార్చాడు. మొదట్లో ఆయన లుక్‌పై విమర్శలు, ట్రోల్స్‌ వచ్చాయి. ఆకస్మాత్తుగా చాలా సన్నబడ్డపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు ఇక్కడ ఆయన ఫేస్‌ అంత పీక్కుపోయి.. పీలగా కనిపించాడు. ఈ లుక్‌ బాగాలేదంటూ క్రిటిక్స్‌ నుంచి విమర్శలు వచ్చాయి. మరోవైపు ఫ్యాన్స్‌ మాత్రం ఆయన ఏమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయా అనే ఆందోళన చెందారు.

చివరకు ఇది ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా కోసమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుంచి ఎన్టీఆర్‌కి రిస్క్‌ చేయడమంటే ఇష్టమనే విషయం తెలిసిందే. సినిమాలోనే తన పాత్రల కోసం తారక్‌ ఎంతటి రిస్క్‌ అయినా చేస్తాడు. గతంలోనూ చాలా సార్లు ఆయన సన్నబడ్డారు. అలాగే, కథ డిమాండ్‌ బట్టి బీస్ట్‌ మోడ్‌లోకి కూడా మారాడు. ఇలా ఎప్పుడు తన కొత్త లుక్స్‌ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ, ఈసారి ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్‌ మాత్రం ప్రతి ఒక్కరి షాకిచ్చిందనే చెప్పాలి. సినిమా కోసం ఎవరైనా జిమ్‌ చేసి కండలు పెంచడం ఇప్పటి వరకు చూశాం.

ఎన్టీఆర్ లుక్ పై ఆందోళన
కానీ, ఇలా పీలగా మారడేమేంటనేది అందరిలో ఉన్న సందేహం. ఈ విపరీతైమన మార్పు వల్ల భవిష్యత్తులో తారక్‌ ఆరోగ్యం దెబ్బ తింటుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్‌ సినిమా కోసం ఇంత రిస్క్‌ చేయడం చూస్తుంటే నటన పట్ల ఎన్టీఆర్‌కి ఉన్న నిబద్ధత, ప్యాషన్‌ అర్థమైపోతుంది. కథ ఏదైనా.. తన పాత్ర కోసం తారక్‌ ప్రాణం పోస్తాడనేది అందరికి తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్‌ కోసం తారక్‌ తీసుకున్న రిస్క్‌ మరోసారి రుజువు చేస్తోంది. సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోయినా తారక్‌ లుక్‌ మాత్రం మూవీపై అంచనాలు పెంచుతోంది. మరి డ్రాగన్‌ కోసం నీల్‌ మావ ఎలాంటి ప్లాన్‌ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ ఎలా హైలెట్‌ అవ్వనుందనేది ఆసక్తిని సంతరించుకుంది.

Also Read: Actress Poorna: మరోసారి తల్లయిన నటి పూర్ణ.. అపురూపమైన కానుక అంటూ ఎమోషనల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News