Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభJr NTR: త్రివిక్ర‌మ్ సినిమాకు ప్రిపేర్ అవుతోన్న ఎన్టీఆర్‌.. ఇదిగో ప్రూఫ్‌

Jr NTR: త్రివిక్ర‌మ్ సినిమాకు ప్రిపేర్ అవుతోన్న ఎన్టీఆర్‌.. ఇదిగో ప్రూఫ్‌

Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో లాజిక్స్‌తో పాటు హీరోయిజం, హీరోయిన్ గ్లామర్, సంచులకొద్దీ పంచ్ డైలాగులు, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సన్నివేశాలు హాలీవుడ్ స్టైల్లో స్టంట్స్ ఉంటాయి. కానీ, బలమైన కథ మాత్రం ఉండదనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇదంతా పక్కన పెడితే మాటల మాంత్రీకుడికి మాత్రం పెద్ద హీరోలందరు డేట్స్ ఇస్తుంటారు. ఆయన డైరీలో కేవలం పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్‌టిర్ లాంటి అగ్ర హీరోలకే స్థానం ఉంటుంది. వాళ్లతోనే రిపీటెడ్‌గా సినిమాలు చేస్తుంటారు.

- Advertisement -

అల్లు అర్జున్‌తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి సినిమాలు తీశారు. పవన్ కళ్యాణ్‌తో జల్సా, అత్తారంటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు తీశారు. మహేశ్ బాబుతో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తీశారు. ఎన్‌టిర్ తో మాత్రం అరవింద సమేత వీర రాఘవ ఒక్కటే తీశారు. అయితే, గురూజి నెక్స్ట్ సినిమాను తారక్‌తోనే తీయబోతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. వాస్తవానికి అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సింది. కానీ, ఆయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో భారీ ప్రాజెక్ట్‌ని కమిటైయ్యారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/boyapati-srinu-planning-for-special-song-in-akhanda-2/

దాంతో నెక్స్ట్ వెంకీ మీద ఫోకస్ చేశారు. ఇటీవల సితార సంస్థలో వెంకటేశ్, ఎన్‌టిర్ సినిమాలుంటాయని కన్‌ఫర్మ్ చేశారు. ఈ క్రమంలో ముందు వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా మొదలవబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆ తర్వాత తారక్‌తో సినిమా ఉంటుంది. ఇది ఒక మైథలాజికల్ కథతో రూపొందే సినిమా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ సుబ్రమణ్య స్వామి పాత్రలో కనిపిస్తారని చెప్పుకుంటున్నారు.

అందుకే, ఆయన మురుగన్ కథను తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఈ విధంగా మురుగన్ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ముంబైలో ఉన్నారట. వార్ 2 బ్యాలెన్స్ షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి ముంబైకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన చేతిలో మురుగన్ పుస్తకం కనిపించింది. దీంతో వార్ 2 పూర్తవగానే త్రివిక్రమ్ సినిమా ప్రిపరేషన్ మొదలుపెట్టనున్నట్టు లేటెస్ట్ న్యూస్. త్రిపులార్, దేవర చిత్రాలతో పాన్ ఇండియా వైడ్‌గా తారక్ కి మంచి క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News