Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభ'Ka' sensational collections: డే 1 'క' సినిమా వసూళ్లు 6.18 కోట్ల పైమాటే

‘Ka’ sensational collections: డే 1 ‘క’ సినిమా వసూళ్లు 6.18 కోట్ల పైమాటే

ఎట్టకేలకు ఓ హిట్టు..

రూ.6.18 కోట్ల డే 1 గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం “క” మూవీ

- Advertisement -

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఆడియెన్స్ నుంచి “క” సినిమా తెచ్చుకుంటున్న రెస్పాన్స్ డే 1 వసూళ్లలో స్పష్టమవుతోంది. ఈ సినిమా 6.18 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు బుకింగ్స్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే “క” ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనున్నట్లు తెలుస్తోంది.

ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామనే ప్రశంసలు “క” సినిమాకు దక్కుతున్నాయి. కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతోంది. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad