Homeచిత్ర ప్రభKamal Haasan : నేను బానే ఉన్నాను.. జ్వరం వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాను.. మీరు ఎక్కువ...

Kamal Haasan : నేను బానే ఉన్నాను.. జ్వరం వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళాను.. మీరు ఎక్కువ ప్రచారం చేసేస్తున్నారు..

- Advertisement -

Kamal Haasan : స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవలే అస్వస్థతకి గురయి హాస్పిటల్ లో చేరారు. కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరారు అనడంతో అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఆయన జ్వరంతో హాస్పిటల్ లో చేరి రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కమల్ ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

విజయ్‌ సేతుపతి హీరోగా, పొన్‌రామ్‌ దర్శకత్వంలో, మరో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో తెరకెక్కిన DSP సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో కమల్ తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు.

DSP ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ”గతంలో పెద్ద ప్రమాదానికి గురయినా పరామర్శించి, త్వరగా కోలుకోమని చెప్పి, తర్వాత మళ్ళీ ఎప్పుడు నటిస్తున్నారు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు అని అడిగేవారు. కానీ ఇప్పుడు చిన్నగా కాలు గీరుకుపోయినా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. మీడియా, అభిమానం ఈ రెండిటి వల్లే ప్రతిదీ పెద్దగా ప్రచారం జరుగుతుంది. నేను కేవలం దగ్గు, జ్వరం వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అంతే. ప్రస్తుతం బాగున్నాను” అని తెలిపారు. కమల్ హాసన్ స్వయంగా పబ్లిక్ లో కనపడి బాగున్నాను అని చెప్పడంతో కమల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News