Kangana Ranaut on Deepika Working Hours: సినీ ఇండస్ట్రీలో వర్కింగ్స్ అవర్స్ పెద్ద చర్చ కొనసాగుతుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తానని నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన వల్ల ఆమె భారీ ప్రాజెక్ట్సని సైతం కోల్పోయింది. కానీ, దీపికా మాత్రం తాను తగ్గేదే లే అంటుంది. ఆమె వర్కింగ్స్ అవర్స్ విషయంపై ఎప్పుడు మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
దీపిక స్పెషల్
దీనిపై పలువురు హీరోయిన్లు సైతం స్పందిస్తూ ఆమెకు మద్దతు ఇచ్చారు. తాము ఎన్ని గంటలైన చేస్తామని, కానీ దీపిక పెట్టిన నిబంధనలలో తప్పులేదంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కూడా స్పందించింది. ఇటీవల ఓ అంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కంగనా దీపికా వర్కింగ్ అవర్స్ నిబంధనపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ దీపికకు మద్దతుగా నిలిచింది. ఆమె ప్రత్యేకమైన నటి అని, ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకునే హక్కు ఆమెకు ఉందని పేర్కొంది.
దీనిపై అంత వివాదమేందుకు
వర్కింగ్స్ అవర్స్ విషయంలో వివాదం సృష్టించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్‌లో దీపికా స్థానం ప్రత్యేకమైనది. ఆమె ఎంతో కష్టడి ఈ స్థాయికి వచ్చారు. పైగా ఇప్పుడామె ఓ బిడ్డకు తల్లి కూడా. ఒకవేళ ఆమె 8 గంటలు మాత్రమే పని చేస్తానని అంటే కచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్న హక్కు తనకి ఉంది. గతంలో నేను దీపికా కలిసినప్పుడు దీపిక ఇంతియాజ్ అలీ సినిమా కోసం 12 గంటలు పని చేస్తున్నట్టు చెప్పింది. అప్పుడు నేను కేవలం పది గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పా. అప్పట్లో మేము సినిమా కోసం ఎన్ని గంటలైన పని చేసేవాళ్లం. నటన అంటే చాలా ఉత్సుకతతో ఉండేవాళ్లం. సినిమా ఏమైనా, ఏదైనా చేయడానికి సిద్దంగా ఉండేవాళ్లం. అందుకే ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది.
అలా ఎందుకు చేయకూడదు
‘‘కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ఎవరికైనా వారి స్థానం, పాత్ర మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇప్పుడు దీపిక స్థానం స్థిరమైంది. పైగా ఇప్పుడామే ఓ బిడ్డకు తల్లి. కుటుంబం తర్వాతే ఏమైనా. ఎవరైనా కచ్చితంగా తనతో పనిచేయాలనుకుంటే ఆ 8 గంటలు పనిచేయడానికి ఇష్టపడే పిలుస్తారు. అలా ఎందుకు చేయకూడదు. ప్రస్తుతం ఎక్కువమంది సంతాన సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఏం చేస్తారు? మాపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఇటు కుటుంబం అటు పిల్లలతో పని రెట్టింపు అవుతోంది. ఇప్పుడు పేర్లు చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది నటులు ఏళ్ల నుంచి 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. వారాంతాల్లో వారు షూటింగ్‌లకు రారు’ అని కంగనా పేర్కొంది. దీపికా తన వర్కింగ్ అవర్స్ రూల్స్ వల్ల ‘స్పిరిట్’, ‘కల్కి 2’ చిత్రాల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read: Singer Mangli: నేను కూడా బాధితురాలినే.. నేను ఏ తప్పు చేయలేదు: మంగ్లీ

