Ramya : చాలా గ్యాప్ తర్వాత షారుఖ్ హీరోగా వస్తున్న సినిమా పఠాన్. దీపికా పదుకొనే హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘బేషరం రంగ్’ అనే ఓ రొమాంటిక్ పాటని రిలీజ్ చేశారు. ఈ పాటలో దీపికా హద్దులు మీరి ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇక షారుఖ్ కూడా దీపికతో బానే రొమాన్స్ చేశాడు. ఈ పాటలో దీపికా డ్యాన్స్, ఎక్స్‌పోజింగ్ కొంచెం అభ్యంతరకరంగా ఉండటంతో దేశవ్యాప్తంగా చాలా మంది ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు.
పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ పాటని విమర్శిస్తున్నారు. దీపికాని కూడా ఈ విషయంలో బాగా ఎక్స్‌పోజింగ్ చేసిందని, బట్టలు మరీ దరిద్రంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా దీపికాకి సపోర్ట్ గా కన్నడ నటి రమ్య ఓ ట్వీట్ చేసింది.
రమ్య చేసిన ఈ ట్వీట్ లో.. విడాకుల విషయంలో సమంతని, తన ఒపీనియన్ ని చెప్పినందుకు సాయి పల్లవిని, బ్రేకప్ చేసుకున్నందుకు రష్మికని, ఇప్పుడు సాంగ్ లో బట్టల విషయంలో దీపిక పదుకొనేని ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇలా ఆడవాళ్ళ మీదే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. ఇది మా ఇష్టం. ఈ స్త్రీ ద్వేషం పోవాలి అని తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు రమ్య చేసిన ట్వీట్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది ఈ విషయంలో రమ్యని కూడా ట్రోల్ చేస్తున్నారు.