Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభDirector Narthan : కన్నడ డైరెక్టర్ కి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడా??

Director Narthan : కన్నడ డైరెక్టర్ కి విజయ్ దేవరకొండ ఓకే చెప్పాడా??

- Advertisement -

Director Narthan : రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో అసలు మీడియా ముందుకు కూడా రావట్లేదు. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న ఒక్క సినిమా ఖుషి. సమంతతో కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా సమంతకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. పూరి-విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన జనగణమన కూడా ఆగిపోయింది. దీంతో విజయ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.

కొన్ని యాడ్స్ తప్ప ప్రస్తుతం విజయ్ చేతిలో సినిమాలు ఏమి లేవు. కథలైతే వింటున్నాడు. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని సెట్ చేసుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నాడు. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి విజయ్ ఛాన్స్ ఇచ్చాడన్న న్యూస్ బాగానే వినిపించినా దాని మీద క్లారిటీ రాలేదు. తాజాగా కన్నడ యంగ్ డైరెక్టర్ నర్తన్ విజయ్ కు ఒక స్టోరీ నెరేట్ చేశాడని, అది విజయ్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

కన్నడలో శివరాజ్ కుమార్ తో మఫ్టీ అనే సినిమా తీసిన నర్తన్ తో గతంలో రామ్ చరణ్ మూవీ ఉంటుందని టాక్ నడిచింది. తాజాగా నర్తన్ చెప్పిన స్టోరీ విజయ్ కి నచ్చిందని, నిర్మాత దిల్ రాజు మరో కన్నడ నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News