Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభKannappa: కన్నప్ప శాటిలైట్ హక్కులకి ఫ్యాన్సీ డీల్

Kannappa: కన్నప్ప శాటిలైట్ హక్కులకి ఫ్యాన్సీ డీల్

Kannappa Satellite Rights: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబుకి నటుడిగా, నిర్మాతగా ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ని సాధించడమే కాదు, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే పేర్లను తెచ్చిపెట్టాయి. ఇక మంచు మోహన్ బాబు నట వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీ వచ్చి నటులుగానూ, నిర్మాతలుగానూ నిరూపించుకున్నారు.

- Advertisement -

అయితే, ఏ హీరోకైనా.. నిర్మాతకైనా అప్స్ అండ్ డౌన్స్ సహజం. కానీ, మంచు హీరోలు మాత్రం సక్సెస్‌లు లేక గత కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎట్టకేలకి మంచు వారి డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విడుదల రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ళ పరంగా దుమ్ములేపుతోంది. కన్నప్ప మేకింగ్ సమయంలో ఆర్థికంగా హీరో విష్ణు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో మంచు ఫ్యామిలీలోనూ రక రకాల సమస్యలు తలెత్తి ఈ సినిమాపై ప్రభావం చూపుతుందనుకున్నారు. కానీ, కన్నప్ప వీటన్నిటినీ అధిగమించాడు. ప్రధాన పాత్ర పోషించిన విష్ణు కాకుండా సినిమాను తారాస్థాయికి తీసుకెళ్ళిన ప్రభాస్ ఇతర పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇతర నటీనటులు కన్నప్ప విజయంలో భాగమయ్యారు. ఈ సినిమా సక్సెస్‌తో ఒక్కసారిగా విష్ణు బౌన్స్ బ్యాక్ అయ్యారు. కొత్త సినిమాలకి సంబంధించిన చర్చలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘కన్నప్ప’ చిత్రానికి భారీ స్థాయిలో హిందీ శాటిలైట్ హక్కులు అమ్ముడయినట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ పాపులర్ లీడింగ్ ఏజెన్సీ కన్నప్ప మూవీ రైట్స్‌ను రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే మంచు విష్ణు కెరీర్‌లోనే కాకుండా.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి భక్తి ప్రధానమైన చిత్రాల జాబితాలోనూ భారీ డీల్ అని చెప్పక తప్పదు. ఒక భక్తి ప్రధానమైన చిత్రానికి బాలీవుడ్‌లో ఇంతగా డిమాండ్ రావడం చాలా గొప్ప విషయం. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ‘కన్నప్ప’ మూవీకి హైప్ ఏ విధంగా పెరిగిందో తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News