Monday, December 9, 2024
Homeచిత్ర ప్రభKannappa: ప్రభాస్ లుక్ లీక్‌.. 'కన్నప్ప' చిత్రబృందం వార్నింగ్

Kannappa: ప్రభాస్ లుక్ లీక్‌.. ‘కన్నప్ప’ చిత్రబృందం వార్నింగ్

Kannappa| మంచు విష్ణు హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘కన్నప్ప’ మూవీ నుంచి ప్రభాస్ ఫొటో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో లీక్‌పై కన్నప్ప మూవీ యూనిట్ తాజాగా స్పందించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫొటోను షేర్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే ఫొటో లీక్ చేసిన వారిని కనిపెడితే రూ.5లక్షలు బహుమతిగా ఇస్తామని తెలిపింది.

- Advertisement -

ప్రకటనలో ఏం పేర్కొన్నారంటే..

‘‘కన్నప్ప కోసం గత ఎనిమిది సంవత్సరాలుగా మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయి. దీని కోసం మా టీమ్‌ నిరంతరం కృషి చేస్తోంది. ఇలాంటి సమయంలో ‘కన్నప్ప’ నుంచి ఒక్క ఫొటో అనధికారికంగా లీక్‌ అయినందుకు బాధపడుతున్నాం. ఈ లీక్‌ మా కష్టాన్ని మాత్రమే కాదు.. ఈ ప్రాజెక్ట్‌ కోసం నిరంతరం కృషి చేస్తున్న రెండు వేల మంది వీఎఫ్‌ఎక్స్‌ కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ఫొటో బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై పోలీస్‌ కేసు పెట్టాము. దయచేసి ఈ ఫొటోను ఎవరూ షేర్‌ చేయొద్దని మనవి. దీన్ని షేర్‌ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫొటోను లీక్‌ చేసిన వ్యక్తిని కనిపెట్టినవారికి రూ.5 లక్షలు బహుమతిగా అందిస్తాం. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మీ మద్దతుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది.

కాగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్స్ మూవీపై ఆసక్తి రేపాయి. ఇక ముఖేష్ కుమర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ నటుడు శరత్ కుమార్, జగపతిబాబు, మోహన్ బాబు తదితరులు నటిస్తున్నారు. వీరితో పాటు రెబల్ స్టార్ ప్రభాస్(Prabahas) కూడా ఇందులో ముఖ్యమైన శివయ్య పాత్రలో నటించడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News