Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభKantara: 400 కోట్ల క్లబ్ లో కాంతారా, బాక్సాఫీస్ షేక్ చేసిన కన్నడ ప్యాన్ ఇండియా...

Kantara: 400 కోట్ల క్లబ్ లో కాంతారా, బాక్సాఫీస్ షేక్ చేసిన కన్నడ ప్యాన్ ఇండియా మూవీ

- Advertisement -

Kantara: ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా సింపుల్ బడ్జెట్ లో రెడీ అయి ఈ ఇయర్ సెన్సేషనల్ హిట్ సాధించింది శ్యాండిల్ వుడ్ మూవీ కాంతార. రిషబ్ షెట్టీ డైరెక్టర్-హీరోగా యాక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క కర్నాటకలోనే ఈ సినిమా 169 కోట్లు వసూలు చేయగా, తెలుగులో ఏకంగా 60 కోట్లు రాబట్టింది.

ఇక నార్త్ ఇండియాలో సుమారు 96 కోట్ల కలెక్షన్ రాగా, ఓవర్సీస్ మార్కెట్లో 44 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కేరళలో 19 కోట్లు, తమిళనాడులో 12 కోట్ల కలెక్షన్ దాటి తన సత్తా చాటుకుంది. సెప్టంబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫాంపై అతి త్వరలో రిలీజ్ కానుంది.

మొదట కేవలం కన్నడలో మాత్రమే రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం సాధించిన ఈ సినిమా జస్ట్ మౌత్ టాక్ తోనే ఇండియాలో అందరిని ఆకట్టుకోవటం విశేషం. కన్నడలో సినిమా సూపర్ హిట్ అనే టాక్ రాగానే ఈ సినిమా థియేట్రికల్ డబ్బింగ్ రైట్స్ కోసం పలు భాషల్లో ప్రొడ్యూసర్స్ క్యూ కట్టారు. దీంతో ఆతరువాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మళయాళంలోనూ సినిమాను రిలీజ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News