Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభPrabhas: రాజాసాబ్ కోసం రెడీ అవుతున్న కరీనా..?

Prabhas: రాజాసాబ్ కోసం రెడీ అవుతున్న కరీనా..?

Kareena in Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్ర‌భాస్ క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకి డార్లింగ్ రేంజ్ అంతకంతా పెరుగుతూనే ఉంది. సలార్ మూవీలో ప్రభాస్ చేసిన యాక్షన్ సీన్స్ చూసి, ఆ తర్వాత ప్రతీ దర్శకుడు అంతకు మించి చూపించాలనే కసిని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ‘ది రాజాసాబ్’ మూవీని అలాగే, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీని చేస్తున్నారు.

- Advertisement -

మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ షూటింగ్ ఇంతకాలం బాగా నెమ్మదిగా సాగింది. అయితే, ఇప్పుడు జోరు పెంచనున్నారట. జులై మొదటివారం నుంచి కొత్త షెడ్యూల్ మొద‌ల‌వబోతుంది. ఈ షెడ్యూల్‌లో డార్లింగ్ కూడా జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌తో రాజాసాబ్ టాకీపార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందట. దాంతో, నెక్స్ట్ సాంగ్స్ షూట్ చేయడానికి ప్రణాళిక వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, లేటెస్ట్ న్యూస్ ఒకటి రాజా సాబ్ సినిమాకి సంబంధించి నెట్టింట వైరల్ అవుతోంది.

మారుతి.. రాజా సాబ్ మూవీలో ఓ ఐటం సాంగ్‌ను ప్లాన్ చేశారట. ఇంతకముందే దీనికి సంబంధించి వార్తలు వచ్చాయి. ఈ ఐటం సాంగ్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారట. ప్రభాస్, నయన్ కలిసి ‘యోగి’ సినిమాలో జంటగా నటించారు. కాబట్టి, ఐటం సాంగ్ ని నయన్ తో చేయిస్తే మంచి క్రేజ్ వస్తుందని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ, పలు కారణాల వల్ల నయన్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. దాంతో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా లేటెస్ట్ న్యూస్.

ప్రభాస్ సినిమాలో కరీనా ఐటం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా తెలీదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం కరీనా కాకుండా ఊర్వశి రౌతెలా, జాన్వీ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండస్ లలో ఎవరైనా బావుంటుందని మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ సరసన అంటే అందాలతో అలరించే హాట్ బ్యూటీ ఉండాలని సూచిస్తున్నారు. మరి దీనిపై మారుతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రాజాసాబ్ కోసం ఐటం సాంగ్‌లో ఎవరిని చూపించబోతున్నారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే. ఇప్పటికే, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లాంటి ముగ్గురు గ్లామర్ డాల్స్ రాజాసాబ్‌లో అలరించడానికి రెడీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News