Homeచిత్ర ప్రభKarthi : హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్‌తో ‘సర్దార్ 2’.. సినిమాపై అంచనాలు పెంచేసిన హీరో కార్తి

Karthi : హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్‌తో ‘సర్దార్ 2’.. సినిమాపై అంచనాలు పెంచేసిన హీరో కార్తి

Karthi interview about Sardar 2 movie : హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో కార్తి పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ వివరాలు ఏమిటో ఆయన మాటల్లో…

- Advertisement -

“ఇండియాలో స్పై సినిమాలు చాలా తక్కువ. ఆ సినిమాలు తీయడం అంత ఈజీగా కూడా కాదు. మనకి స్పై అంటే టామ్ క్రూజ్ లాంటి హీరోలు గుర్తుకొస్తారు. ‘సర్దార్’ కథ చెప్తున్నప్పుడు ఒక లుంగీ వేసుకున్న గూఢచారి అని చెప్పినప్పుడు వెంటనే కనెక్ట్ అయ్యాను. రవీంద్ర కౌశిక్ అనే ఒక రంగస్థల నటుడు పాకిస్తాన్‌లో ఒక మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. ఆ కథ మనందరికీ తెలుసు. అలాగే స్పై అధికారులు మనమధ్యే సాదాసీదాగా ఏం తెలియనట్లు ఉంటారు. దర్శకుడు అలాంటి అంశాలన్నీ జోడిస్తూ కథ చెప్తున్నప్పుడు నాకు చాలా నచ్చింది. మనకి ప్రపంచంలో ప్రాచీన నాగరికత నుంచి యుద్ధం జరిగినప్పుడు ఒక దేశానికి మరో దేశానికి వాటర్ కనెక్షన్ ఆపేసేవారు. నీరే మనకి జీవం. అలా వాటర్ కాన్సెప్ట్ గురించి చెప్తున్నప్పుడు అందరికీ అది చాలా కొత్త విషయం అనిపించింది. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ‘విక్రమ్’ లాంటి సినిమాల్లో చూస్తే అందులో ఒక పర్సనల్ వార్ ఉంటుంది. ‘సర్దార్’ విషయానికి వస్తే అది ఒక సొసైటీ కోసం ఒక గూఢచారి చేస్తున్న వార్. వాటర్ కమర్షియల్ కాకూడదని అతను చేస్తున్న పోరాటం. దేశం కోసం ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని త్యాగం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్‌కి చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

సర్దార్ కంటే సర్దార్ 2 పది రెట్లు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది : సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు ‘సర్దార్’ మళ్లీ ఎందుకు తిరిగి వచ్చాడు అనేది ఒక గొప్ప ఆలోచనతో డైరెక్టర్ వచ్చారు. అలాగే దాంతో పాటు విలన్ క్యారెక్టర్ కూడా దొరికిందని చెప్పారు. ఆ క్యారెక్టర్ ఎస్జే సూర్య చేస్తున్నారు. ఇప్పుడే సర్దార్ 2 కాన్సెప్ట్ గురించి ఎక్కువ చెప్పకూడదు. సర్దార్ లో వాటర్ కాన్సెప్ట్ మీకు ఎలా ఇంపాక్ట్ చేసిందో.. దానికి పది రెట్లు ఇంపాక్ట్‌ఫుల్‌గా ‘సర్దార్ 2’ ఉంటుంది. ‘సర్దార్’ సినిమాని తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆదరించారు.  మనకి ఈ మధ్యకాలంలో స్పై యూనివర్స్‌లో ‘దురంధర్’ సినిమా వచ్చింది. కాకపోతే దాని కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు ‘సర్దార్ 2’లో కూడా కాన్సెప్ట్ పరంగా, విజువల్ పరంగా చాలా హై స్టాండర్డ్‌లో ఉండబోతుంది. సౌత్‌లో కూడా ఇంత గొప్ప స్థాయిలో సినిమా చేయగలమని చెప్పేలా ‘సర్దార్ 2’ ఉంటుంది. చాలా లార్జ్ స్కేల్‌లో సినిమా చేశాం. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి చివరి వరకు అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ప్లాష్ బ్యాక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News