ఈరోజు ఎపిసోడ్‌లో కార్తిక్, ధశరథతో ఈ విషయం ముందు చెప్పడానికి తాతయ్య నాకు అవకాశం ఇవ్వలేదు లేదంటే చెప్పేవాడిని అంటాడు తప్పు మాదేలే అంటాడు దశరథ. దీప దశరథను ఎలా ఉన్నారు అని పకరిస్తుంది దానికి ఏమి సమాధానం ఇవ్వకుండా ఉండిపోతాడు దశరథ. దీపని ఏమి అనుకోకు తాతయ్య గీసిన గీత దాటడు మావయ్య అంటాడు కార్తిక్. దీప, కార్తిక్ లను ఫాలో అయ్యి ఆగి వాళ్ల ఇద్దరిని ఆపి మాట్లాడుతుంది. మా విషయంలో దూరితే బాగోదు అని దీపకి వార్నింగ్ ఇస్తుంది జోత్స్న. రివర్స్‌లో దీప, కార్తిక్ కుడా గట్టిగా ఇస్తారు. ఆస్తి అశ్వైర్యం ఉన్నాయని రెచ్చిపోకు ఏదొక రోజు గట్టిగా దెబ్బ తింటావు అని దీప చెప్తుంది.
అలా సైకిల్ మీద ఇంటికి వచ్చిన దాప, కార్తిక్‌లను ఇంట్లో వాళ్లు చూసి కుదుట పడుతారు. అక్కడ జరిగిన విషయం అంతా ఇద్దరూ చెప్తారు. జోత్స్నతో సారీ చెప్పించి తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు అని చెప్తాడు. మెడలో దండ ఏంటి అని సౌర్య అడిగి ఇద్దరి మెడలో వేసి ఒక ఫోటో తీయిస్తుంది. అలా గదిలోకి వెళ్లి మెడలో దండ తీసి గొళ్లానికి పెడుతుంది. వెనకాల దీప వాళ్ల అత్త వచ్చి ఏమే నీకు కార్తిక్ మీద ప్రేమ లేదా ఇంత దూరం ప్రయాణం చేశాక కుడా లేదంటే ఎలా అని అడుగుతుంది. నీ భర్తకి నీ మీద చాలా ప్రేమ ఉంది అంటుంది. ఆయనకు ఉందిప్రేమ కాదు అభిమానం ,కృతజ్ఞత అంతే అంటుంది. నాకు ఆయన మీద దేవుడి మీద ఉన్నట్టే ఆరాధన ఉంది అంటుంది.
సౌర్య కార్తిక్ లాకెట్‌ను తీసుకుని దొరికిపోతుంది, ఇది తీయద్దన్ననా ఎందుకు తీశావ్ అంటే నాకు నచ్చింది తీసాను అంటుంది సౌర్య. ఆ లాకెట్ ఇచ్చేయ్ అంటే ఇవ్వను అని మెడలో వేసుకుంటుంది. సౌర్య ఇవ్వను అని మొండికేస్తుంది. ఎలాగోలాగ దీప తీసి ఇస్తుంది. కార్తిక్ బాబు గిఫ్ట్ అది నువ్వు తీసుకోకూడదు అంటుంది. ఇది ఎవరు ఇచ్చారు చూపించు అంటే నా పక్కన లేరు చూపిండానికి అంటాడు కార్తిక్. అలా ఆ లాకెట్ మెడలో వేసుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.