ఈరోజు ఎపిసోడ్‌లో పారిజాతం, జోత్స్న మాట్లాడుకుంటూ ఈ ఆస్తి అంతా నీ పేరు మీదకి వచ్చేంత వరకూ కాస్త ఒపికగా ఉండు అంటుంది. ఈలోగా దాసు సుమిత్ర, ధశరథ్‌లను కలవడానికి శివన్నారాయణ ఇంటికి వస్తాడు. దాసు రావడం శివన్నారయణ చూసి ఆగు ఈ టైంలో ఎందుకు వచ్చూవు నీకు ఇక్కడ ఏమి పని అని అడుగుతాడు. దొంగతనానికి వచ్చావా అని గట్టిగా అడుగుతాడు. నిలదీస్తాడు. నా కోసం వచ్చావా అని పారిజాతం అడుగుతుంది. నీకోసం కాదు అన్నయ్య కోసం వచ్చాను అంటాడు దాసు. అప్పుడు ధశరథ్ ఆగండి నాన్న అని దాసుతో మాట్లాడానికి ట్రై చేస్తాడు. ధశరథ్‌ను ఆపి దాసును శివన్నారాయణ బయటికి పంపించేస్తాడు.
అప్పుడు జోత్స్న మాత్రం ఏదో జరిగింది వీళ్లని నమ్మడానికి వీలు లేదు అమ్మానాన్నలను కొన్ని రోజులు వదలకూడదు అని అనుకుంటుంది. మరోవైపు అక్కడ శౌర్య ఆడుకుంటూ కింద పడిపతుంది. శౌర్యను చూసి ఏమైంది, ఏమైంది అంటూ లేపుతూ కంగారు పడుతారు. శౌర్యకు మళ్లీ హార్ట్ ప్రాబ్లెమ్ మళ్లీ మొదలైనట్టుంది అని కార్తిక్ కంగారు పడతాడు. కార్తీక్ ఆలస్యం చెయ్యకుండా శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. దీప వస్తా అంటే వద్దు ఇక్కడే టిఫిన్ పని చూసుకో అని వెళ్తాడు.
ఆస్పత్రులో డాక్టర్ టెస్ట్‌లు చేసి డాక్టర్ ఆమెకు ఇంజక్షన్ చేస్తాడు. నీకు కళ్లు తిరిగినట్టు ఉంటుంది అలా పడుకో అని డాక్టర్ చెప్తాడు. ఈలోపు దీప పదే పదే కార్తిక్‌కు కాల్ చేస్తుంది. కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ అంతా బాగానే ఉంది నువ్వు కంగారు పడకు అని ఫోన్ పెట్టేస్తాడు. శౌర్య నిద్రపోయాక తన పరిస్థితి బాగోలేదు వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్తాడు. ఆ మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు. ఆపరేషన్‌కు రూ.50 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తే ఏమి చేయాలో తెలియక కార్తిక్ ఇంకా టెన్షన్ పడుతాడు. ఆ మెడిసిన్ చాలా కాస్ట్ అని చెప్తాడు. అంత డబ్బు ఎలా తీసుకురావాలని అని భయపడుతాడు. శౌర్య లేచాకా అంతా ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తాడు.
మరోవైపు ఉదయం సుమిత్రకు అంతా చెప్పటానికి ఇంటికి వచ్చిన దాసును జ్యోత్స్న చూసి బయటకు లాక్కొని వచ్చి ఏమి చెప్పవద్దు అని బతిమాలుతుంది. ఒక్కసారి అవకాశం ఇవ్వు అంటే ఇవ్వను అంటాడు. నువ్వు అంతా చెప్పేస్తే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుంది. చచ్చిపోయినా సరే నేన చెప్తాను అని వెళ్తుంటే జోత్స్న అక్కడే ఉన్న స్టీల్ రాడ్ తీసుకోని దాసు నెత్తి మీద కొడుతుంది. ఆ దెబ్బకు దాసు అన్నయ్యా అని అరుస్తాడు, ఆ అరుపుకు ఎవరు అలా అరిచారని ధశరథ్ పైనుంచి చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.