ఈరోజు ఎపిసోడ్‌లో దాసుని చూడటానికి వచ్చిన పారిజాతం ఏడుస్తూ ఉంటుంది. జోత్స్న వరసలు కలిపి మాట్లాడుతుంటే వరసలు బాగానే గుర్తున్నాయని కార్తిక్‌లు ఇద్దరూ వాదించుకుంటారు. ఆయనను రెస్ట్ తీసుకోనివ్వండి బయటికి వెళ్దాం రండి అంటే జోత్స్న మాత్రం నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్లండి అంటుంది ఎందుకు అంటే జోత్స్న మనసులో చంపడానికి అంటుంది. వాళ్లందరూ బయటికి వెళ్లిపోయాక అనవరంగా నిన్ను గట్టిగా కొట్టలేదు లేదంటే ఈ పాటికి స్మశానంలో కాలుతూ ఉండేవాడివి అంటుంది. అలా దాసుని తలగడతో నొక్కి చంపేయడానికి ట్రై చేస్తుంటే వెంటనే దాసు కళ్లు తెరుస్తాడు. అప్పుడు జోత్స్న గట్టిగా అరుస్తుంది అందరూ లోపలికి గదిలోకి రాగ ఏమైంది అని అడిగితే బాబాయ్ కళ్లు తెరిచాడు అంటుంది. అందరూ వచ్చి చూసి దాసుని లేపడానికి ట్రై చేస్తారు కానీ దాసు లేవడు. మళ్లీ కోమాలోకి వెళ్లిపోతాడు. దీప జోత్స్నను దీనికి ఎందుకు అలా అరిచావు, టెన్షన్ పడుతున్నావే అని అడుగుతుంది. అప్పుడు జోత్స్స ఏవో కారణాలు చెప్తుంది. అలా అందరూ మట్లాడుకుని పారిజాతం, జోత్స్న, దీప , కార్తిక్ ఎవరింటికి వాళ్లు వెళ్తారు.
అక్కడ ఏమో దశరథ డాక్టర్‌కు థాంక్స్ చెప్తాడు. ఇంటికి వచ్చిన పారిజాతంను దశరథ దాసుకు ఎలా ఉందని అడగుతాడు. పారిజాతం ఏడుస్తూ ఎవరో చంపాలని చూశారట అని చెప్తుంది.గ్రానీ అన్నీ అలానే చెప్తుంది తాగేసి ఎక్కడో పడితే హస్పిటల్లో చేర్చి ఉంటారు అంటుంది జోత్స్న. దానికి దశరథ దాసుకి తాగే అలవాటు లేదు అంటాడు. అప్పుడు పారిజాతం అవి కొట్టిన దెబ్బలు అని డాక్టర్ చెప్పాడంట అంటుంది. దాసు జోత్స్నను చూసి కళ్లు తెరిచిన విషయం పారిజాతం దశరథకు చెప్తుంది.
మరోవైపు కార్తిక్ దీపను దాసుకు జరిగిన విషయంలో నీకు ఏమైనా అనుమానం ఉందా అని అడుగుతాడు. దానికి దీప మనసులో జోత్స్స మీద అనుమానంగా ఉంది అనుకుంటుంది. వాళ్లు ఇద్దరూ అలా మాట్లాడుకుంటారు. ఈలోగా శౌర్య కోసం హాస్పిటల్ నుంచి కాల్ చేస్తారు వెంటనే రమ్మంటారు. అప్పుడు కార్తిక్ దీపను ఇంటికి పంపించేస్తాడు తను వెళ్తాడు.