Tuesday, January 7, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 6th Episode: దీప నీ అసలు కూతురు తల్లీ.. నోరు జారిన...

Karthika Deepam January 6th Episode: దీప నీ అసలు కూతురు తల్లీ.. నోరు జారిన దాసు, ఏం జరుగుతుందో?

ఈరోజు కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్ సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వెళ్తుంటే శ్రీధర్ కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తూ అడ్డగంగా వస్తాడు. హార్న్ కొట్టాలని తెలియదా అని కార్తిక్ అరిస్తే శ్రీధర్ కారు నుంచి బయటకు వచ్చి. ఏంట్రా కార్తికూ నువ్వు ఈ సైకిల్ కొత్త లుక్ అదిరిపోయింది అని వెటకారిస్తాడు. కార్తిక్ సమాధానం చెప్పి వెళ్లిపోతుంటే ఆపి ఓ ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్ దగ్గర పొట్లాలు కట్టాలి కదా అని అంటాడు శ్రీధర్. మాటకు మాట విసిరుకుని గొడవ పడ్డారు. ఇంకెప్పుడు నువ్వు మా తండ్రి అని ఎక్కడా చెప్పకు అంటాడు కార్తిక్. ఆ దీపతో ఉన్నంత కాలం నీకు ఈ తిప్పలు తప్పవు అని సర్వనాశనం అయిపోతారు అని శాపనార్ధాలు పెడతాడు శ్రీధర్.

- Advertisement -

మరోవైపు సుమిత్రను కార్తీక్‌ ఇంటికి తీసుకొస్తాడు దాసు. ఇంటి ముందు టిఫిన్ సెంటర్ దగ్గర వాళ్ళని చూసి సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీపకు పెళ్లి అయ్యాక అయినా కష్టాలు తీరుతాయి అనుకుంటే ఇంకా దేవుడు కష్టాలు పెడుతున్నాడు అని బాధపడుతుంది. మనసులో దాసు నువ్వు నీ ఆడపడుచు కోసం ఆలోచిస్తున్నావు. పక్కన ఉంది నీ యావదాస్తికి వారసురాలు ఇన్ని కష్టాలు పడుతుంది అనుకుంటాడు.

దీప తలరాత మారాలంటే తన అమ్మానాన్న తనకు దక్కాలి అంటాడు దాసు. దీప తల్లితండ్రులు చనిపోయారు కదా అని సుమిత్ర అంటే చనిపోతేదు బతికే ఉన్నారు అని నోరు జారతాడు. ఆ మాటలకు సుమిత్ర ఆశ్చర్యపోతుంది. జ్యోత్స్నకు ఇచ్చిన మాట కోసం దాసు కవర్ చేస్తాడు. దీప మీద ప్రేమను సుమిత్ర బయట పెడుతుంది. వెళ్లిపోదాం పద అనుకుని దీప చేసిన టిఫిన్స్ తినాలని ఉంది అని సుమిత్ర అంటే నీ కూతురు టిఫిన్ నువ్వు తినకపోవడం ఏంటి అని అని మాట మార్చి టిఫిన్స్ పార్సిల్ తీసుకొని వస్తాడు.

వాసనాకే తినాలని అనిపిస్తుంది అయ్యా అంటే ఈలోపు కార్తిక్ ఇంకేందుకు లేట్ తినండి అత్త అంటాడు. కార్తీక్‌ను చూసిన సుమిత్ర వెంటనే కన్నీలు పెట్టుకుంటుంది. అన్నీ వదులుకుని ఇలా సాధారణంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే దీపని చూపించి నా భార్య, నా అమ్మ ఉండగా ఏమి అని అంటాడు కార్తిక్. అవును దీప బంగారం.. నువ్వు గెలుస్తావ్ రా అని సుమిత్ర కార్తీక్ కు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇంట్లో జ్యోత్స్న ఆకలి వేస్తుంది. టిఫిన్ చేద్దాం పదా అని ఇంట్లో అందరిని తీసుకొస్తే సుమిత్ర దీప చేసిన టిఫిన్స్‌ని పెడుతుంది. ఇంట్లో అందరూ ఆ టిఫిన్స్ తిని వావ్ సూపర్ ఉన్నాయి అంటారు. శివన్నారాయణ కూడా పొగడంతో ఈ టిఫిన్స్ ఎక్కడనుంచి తెచ్చావ్ మమ్మీ అని అడుగుతుంది. దీప టిఫిన్ సెంటర్ నుంచి అని సుమిత్ర చెప్తుంది. ఇంట్లో వాళ్ళు అందరు షాకింగ్‌గా చూస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News