Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభKarthikeya new movie: కార్తికేయ కొత్త సినిమా ఇదే

Karthikeya new movie: కార్తికేయ కొత్త సినిమా ఇదే

క్రేజీగా మారిన అనౌన్స్మెంట్

యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ప్రీ లుక్ రిలీజ్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రేపు విడుదల

- Advertisement -

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇవాళ ఈద్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రీ లుక్ ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది. కార్తికేయ నటిస్తున్న 8వ చిత్రమిది. న్యూ కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News