Wednesday, January 15, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 14th Episode: జోత్స్న చెంప మీద దీప అట్లు వేసింది.. ఇన్నాళ్లకు...

Karthika Deepam January 14th Episode: జోత్స్న చెంప మీద దీప అట్లు వేసింది.. ఇన్నాళ్లకు మంచి పని చేసావు కార్తిక్..

ఈరోజు ఎపిసోడ్‌లో కార్తిక్ జోత్స్నకు గట్టిగా సమాధానం ఇచ్చాడు. మా టిఫిన్ సెంటర్ మాత్రమే పోయింది ఇది కాకపోతే ఫుట్‌పాత్ మీద అమ్ముకుంటాము అంటాడు. నువ్వు ఎందుకు ఫుట్‌పాత్ మీద అమ్ముకోవాలి నీకు అంత కర్మ పట్టలేదు అంటుంది జోత్స్న. నేను డబ్బు ఇస్తాను పోనీ అప్పుగా తీసుకో నీకు సాయం చేయడానికి వచ్చాను అంటుంది. నీ సాయం మాకు అక్కర్లేదు అంటాడు కార్తిక్. ఎంత చెప్పినా వెళ్లకపోయేసరికి పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తాడు. దీప మధ్యలో ఆపి ఎందుకు అంత కోపం అని జోత్స్నను వెళ్లిపోమంటుంది. నువ్వేమి నాకు చెప్పక్కర్లేదు ఇప్పుడు వెళ్తాను మళ్లీ వస్తాను. నువ్వు నా సాయం తీసుకునే దాక వదిలిపెట్టను అంటుంది జోత్స్న అలా చెప్పి వెళ్తుంది. కార్ వరకూ జోత్స్న వెళ్లే సరికి కార్తిక్ కాశీ బైక్ తీసుకుని దీప ని బైక్ ఎక్కించుకుని బయటికి వెళ్లాలి అంటాడు.

- Advertisement -

అలా వెళ్లినవాళ్లు జోత్స్న దగ్గర ఆగి కార్ దిగు అంటాడు. జోత్స్న కార్ దిగాక ఎదుకు ఇలా చేశావు అని అడుగుతాడు. దీప కి ఏమి అర్థం కాక ఏమైంది అని అడుగుతుంది నీకు అంతా చెప్తాను ఆగు ముందు సమాధానం చెప్పనివ్వు అని అంటాడు. కార్తిక్ జోత్స్నను కొట్టబోతుంటే దీప ఆపుతుంది. అప్పుడు కార్తిక్ మన టిఫిన్ బండి కాలి పోవడానికి జోత్స్నే కారణం అంటాడు. దీప షాక్ అయ్యి జోత్స్న కారణం మా అని అడుగుతుంది. రౌడీ ఫోన్‌లో జోత్స్న నంబర్ చూసాను అని చెప్తాడు. అప్పుడు జోత్స్న అడ్డంగా దొరికిపోయాను అని భయపడుతుంది. మన బండిని కాల్చేసిన ఈ మనిషిని ఏమి చేయాలి అని దీపని కార్తిక్ అడుగుతాడు. దీప కోపంతో వెంటనే జోత్స్నను లాగిపెట్టి పీకుతుంది. నా తాళిని బేరం పేట్టావు, కార్తిక్ బాబును బెదిరించావు అన్నిటికీ ఊరుకున్నాను.

Image Credits: Disney+hotstar

టిఫిన్ సెంటర్‌ను క్లోజ్ చేయాలి అనుకున్నావు, మా మీద కోపంతో ఉద్యోగులన తీసేసావు అన్నిటిని సహించాను. అన్నిటికీ క్షమించాను కదా అని ఇప్పుడు రెచ్చిపోయి నా బండిని తగలపోడుతావా అని పటా పటా చెంప మీద వాయిస్తుంది. ఉన్న డబ్బులు అన్ని పెట్టి కొనుకున్న బండి అది. నువ్వు ఏ అధికారంతో అలా చేసావాని మామూలుగా వాయించదు పాపం జోత్స్న. ఇక చూసి చూసి కార్తిక్ దీపను ఆపుతాడు. ఇంటి దగ్గరే నీ పని చెప్పేవాడిని కానీ అమ్మ బాదపడుతుంది నా మేనకోడలు ఇంత చెండాలపుదా అని ఫీల్ అవుతుంది అందుకే ఏమి మాట్లడలేదు. నువ్వు నన్ను ఇంటికి వచ్చి మరీ రెచ్చగొట్టావు అందుకే ఇప్పుడు నా భార్య ఆ పని చేసింది అని అంటాడు. నువ్వు అసలు నా అత్త కూతురేనా అంటాడు. అప్పుడు జోత్స్న నేను సుమిత్ర కూతురు అయితేనే కదా ఆవిడ పోలికలు రావడానికి అని మనసులో అనుకుంటుంది. మొత్తానికి ఇద్దరూ జోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు.

దీప కొట్టిన దెబ్బలకు జోత్స్న నెప్పి వస్తుందని అనుకుని దీప మీద ఇంకా కోపం పెంచుకుని పగ పెట్టుకుంటుంది. దీప కార్తిక్‌లను విడదీయాలని అనుకుంటుంది. కార్తిక్, దీపలు వచ్చేసరికి టిఫిన్స్ అన్ని అమ్ముడైపోయాయి అని చెప్తారు. సరుకులు తెస్తాం అని వెళ్లి ఏమి పట్టుకురాలేదే అని అడుగుతారు. కార్తిక్ జోత్స్నతో ఎందుకు అలా గట్టిగా మాట్లాడాడు అని వాళ్ల అమ్మ అడుగుతుంది కానీ ఏమి సమాధానం చెప్పడు. లోపలికి వెళ్లిన కార్తిక్ ఆవేశంతో ఉంటే ఎందుకలా ఉన్నారు అంటే జోత్స్న మంచిది కాదని మా అమ్మకి తెలియాలి, మేనకోడలు చాలా మంచిది అనుకుంటుంది. కానీ ఇంత నీచమన పని చేసిందని తెలియాలి అంటే వద్దు చెప్పకండి అంటుంద దీప. ఈ మాటలన్నీ విన్న దాసు కోపంతో వెంటనే శివన్నారయణ ఇంటి వారసురాలు ఎవరో వెంటనే చెప్పేస్తాను నీ పాపం పండింది జోత్స్న అని కోపంతో అనుకుంటాడు. మరోవైపు జోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. ఎందుకిలా ఉన్నావు నీ దవడ ఎందుకిలా ఎర్రగా ఉంది అని అడుగుతుంది. దీప కొట్టింది అని చెబుతుంది. నిన్ను ఎందుకు కొట్టారు ఆగు మీ తాతయ్యతో చెబుతా అంటే వద్దు వాళ్లకి నిజం తెలిసిపోయింది. అందుకే ఇలా కొట్టారు అని చెబుతుంది. ఎందుకిలా చేసావు మీ తాతయ్యకి తెలిస్తే చంపేస్తాడు అని అంటుంది పారిజాతం. పారిజాతం కుడా నాలుగు మాటలు తిడుతుంది జోత్స్నని. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News