Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభGoogle Search : 2022లో గూగుల్ లో ఆ హీరోయిన్ కోసం తెగ సెర్చ్ చేశారు

Google Search : 2022లో గూగుల్ లో ఆ హీరోయిన్ కోసం తెగ సెర్చ్ చేశారు

2022 ఏడాది మరో 15 రోజుల్లో పూర్తి కానుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా.. గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా వెతికిన సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో గూగుల్ లో అత్యధికంగా వెతికిన ఆసియన్ల జాబితాలో ఓ స్టార్ హీరోయిన్ నాల్గవ స్థానంలో నిలిచింది. పెళ్లైనా ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఎవరో కాదు.. మన మల్లీశ్వరి. గతేడాది డిసెంబర్ లో యువ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్న కత్రినా.. ఆ తర్వాత ఒక్కసినిమాలోనూ కనిపించలేదు.

- Advertisement -

అయినప్పటికీ.. ఆమెకోసం తెగ వెతికారు. ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర వంటి పాన్ ఇండియా సినిమాలతో మెప్పించిన అలియా భట్ ను దాటి.. కత్రినా కైఫ్ అగ్రస్థానంలో ఉండటం విశేషం. అలియాభట్ గూగుల్ సెర్చ్ లో 5వ స్థానంలో నిలిచింది. ‘సూర్యవంశీ’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కత్రినా ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘ధూమ్ 3’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం ఆమె టైగర్ 3, మెర్రీ క్రిస్మస్ సినిమాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News