Friday, July 11, 2025
Homeచిత్ర ప్రభKeerti Suresh: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు..

Keerti Suresh: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు..

Keerthi Suresh Movies: సర్కారు వారి పాట సినిమా నుంచి కీర్తి సురేశ్ గ్లామర్ రోల్స్‌కి రెడీ అనే సంకేతాలను మేకర్స్‌కి బలంగా పంపారు. కానీ, సక్సెస్‌లు లేక తెలుగులో బాగానే గ్యాప్ వచ్చింది. అయితే, ఈ గ్యాప్ కేవలం తెలుగులో మాత్రమే గానీ, మిగతా భాషలలో కాదు. ముఖ్యంగా హిందీలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. బేబీ జాన్, అక్క సిరీస్ అలాగే, ఎప్పటి నుంచో రిలీజ్ ఆగిపోయిన రివాల్వర్ రీటా, ఓటీటీలో నేరుగా విడుదలవబోతున్న ఉప్పు కప్పురంబు సినిమాలతో బిజీగానే ఉన్నారు.

- Advertisement -

అయితే, దసరా మూవీ తర్వాత కీర్తికి తెలుగులో సక్సెస్ దక్కింది లేదు. భోళా శంకర్ మూవీతో మంచి హిట్ దక్కుతుందనుకుంటే ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలకి మళ్ళీ సైన్ చేయలేదు. అయితే, ఇటీవల ఉప్పు కప్పురంబు మూవీ ఈవెంట్‌లో కీర్తికి తెలుగులో చేయబోయే సినిమాల గురించి జర్నలిస్టుల నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి కీర్తి ఎంతో తెలివిగా కమిటైన ప్రాజెక్ట్స్ గురించి రివీల్ చేయకుండా నిర్మాతలు చెప్తారని సమాధానం చెప్పారు.

దాంతో ఇండస్ట్రీలో కీర్తి నెక్స్ట్ సినిమాలేవి అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ మహానటికి ఒకే సంస్థలో రెండు సినిమాలు చేసే ఛాన్స్ వచ్చిందట. అధికారికంగా వాటిని ప్రకటించకపోయినప్పటికీ, అగ్రిమెంట్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ బ్యానర్ ఏదో కాదు, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుది. ఈ సంస్థలో కీర్తి రెండు సినిమాలు చేయబోతున్నారట.

కమెడియన్ వేణు బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఎల్లమ్మ అనే సినిమాను సెట్స్‌పైకి తీసుకురానున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఇందులో యూత్‌స్టార్ నితిన్ హీరో. ఈ మూవీలో ఎల్లమ్మ రోల్ కీర్తి చేయనున్నారు. అలాగే, విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు.. రౌడీ జనార్థన్ అనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో కూడా హీరోయిన్‌గా కీర్తి ఫిక్సయ్యారట. త్వరలో వీటికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది. మొత్తానికి కొద్ది గ్యాప్ తర్వాత రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి కీర్తి రెడీ అవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News