Keerthy Suresh Jagapathi babu Apology : తెలుగు సినిమా ప్రేక్షకులకు ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘భోలాశంకర్’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్ తన ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడుతూ యాక్టర్ జగపతి బాబుకు క్షమాపణలు చెప్పింది.
తాజాగా వ్యాఖ్యాత, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా నిర్వహిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కీర్తి పాల్గొని, తన పెళ్లి విషయాలు, ప్రేమ కథను పంచుకున్నారు. ఈ షోలో జగపతి బాబుకు ప్రత్యేక క్షమాపణలు చెప్పింది. “ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి నా ప్రేమ గురించి తెలిసింది. మీకు (జగపతి బాబు) నమ్మకం చెప్పి వ్యక్తిగత విషయాలు షేర్ చేశాను. కానీ పెళ్లికి పిలవలేకపోయాను. క్షమించండి” అని కీర్తి భావోద్వేగంగా చెప్పారు. ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ALSO READ: Hair Fall: ఈ ఆహారాలకు దూరంగా ఉంటె.. మీ జుట్టు రాలే ఛాన్స్ లేదు!
కీర్తి సురేశ్ 2024 డిసెంబర్ 10, 11 తేదీల్లో ఖతార్‌లోని డోహాలో ఆంథోనీ తట్టిల్‌తో పెళ్లి చేసుకున్నారు. 15 ఏళ్ల ప్రేమ కథ. ఆంథోనీ ఖతార్‌లో బిజినెస్‌మెన్, ఆరేళ్లు దూరంగా ఉండి, 4 ఏళ్ల క్రితం ఫ్యామిలీకి చెప్పి అంగీకారం పొందారు. కీర్తి తండ్రి జీవిత్ సురేష్ వెంటనే అంగీకరించారు. “పెళ్లి అయ్యేవరకు రిజర్వ్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆంథోనీకి ఇండస్ట్రీ లైఫ్ కొత్త, ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాడు” అని కీర్తి ఈ షోలో పంచుకున్నారు.
ఇక తాను, రజనీకాంత్ ఫ్యాన్ అని, కాలేజ్‌లో ఆయన సినిమాలకు డంప్ కొట్టుకున్నానని ఫన్నీగా చెప్పారు. జగపతి బాబుతో ప్రత్యేక బాండింగ్ ఉందని, అందుకే ప్రైవేట్ విషయాలు షేర్ చేసినట్టు వెల్లడించారు. కానీ పెళ్లి రహస్యంగా ఉంచినందుకు పిలవలేకపోవడంతో ఆవేదన చెందానని తెలిపారు. ఈ ఎపిసోడ్ ఈ రోజు మధ్యాహ్నం Aha OTTలో స్ట్రీమింగ్ అయింది.


