Keerthy Suresh latest stills: మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తన గ్లామర్ తో కుర్రాళ్లకు వల వేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ అమ్మడు సుహాస్ కు జోడిగా ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమాలో నటిస్తోంది.
సినీ ఇండస్ట్రీకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ గీతాంజలి అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమయింది.
రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ మూవీ హిట్ కావడంతో ఈ అమ్మడు అవకాశాలు క్యూ కట్టాయి.
నానితో నటించిన ‘నేను లోకల్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత పవన్ సరసన నటించిన అజ్ఞాతవాసి బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
అయితే నాగ్ ఆశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’లో సావిత్రి గారిలా నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.
ఆ తర్వాత ఈ అమ్మడు రంగ్ దే, సర్కారు వారి పాట, భోలాశంకర్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్.. సుహాస్ సరసన ‘ఉప్పు కప్పురంబు’ అనే ఫన్నీ మూవీలో నటిస్తుంది.
పెళ్లైన సరే మహానటి అందం ఎక్కడా తగ్గలేదు. తన లేటెస్ట్ స్టిల్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది కీర్తి.