Harish Rai throat cancer: సినీ పరిశ్రమ బయటి నుంచి చూస్తే ఒక తళుకు బెళుకు ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ, లోపల ఉండే కష్టాలు అంత ఈజీ కాదు. స్టార్ హీరో అయినా, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఎవరికైనా సవాళ్లు తప్పవు. అలాంటి ఒక షాకింగ్ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ‘KGF’ సినిమాలో ఖాసిం చాచా పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు హరీష్ రాయ్ తీవ్రమైన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
ALSO READ: Ap Rains : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: రాష్ట్రంలో మూడు రోజుల వర్ష సూచన
హరీష్ రాయ్, కన్నడ సినిమా రంగంలో 25 ఏళ్లకు పైగా నటుడిగా కొనసాగుతున్నారు. ‘KGF’ సినిమాలో యష్‌కి తండ్రిలాంటి ఖాసిం చాచా పాత్ర ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. కానీ, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. గొంతులో సమస్య ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కారణం? క్యాన్సర్ విషయం తెలిస్తే, సినిమా అవకాశాలు కోల్పోతాననే భయం. గొంతులో వాపును దాచడానికి ఆయన ‘KGF’ షూటింగ్‌లో గడ్డం పెంచారు.
కానీ, ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా మారింది. క్యాన్సర్ నాల్గవ స్టేజ్‌కి చేరుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సర్జరీని వాయిదా వేశారు. నెలకు రూ.3 లక్షలు ఖర్చయ్యే చికిత్స కోసం ఆయన ఆర్థిక సాయం కోరుతున్నారు. ఇటీవల ఓ యూట్యూబర్‌తో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు. దీనికి స్పందనగా చాలా మంది సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు.
హరీష్ రాయ్ ‘బెంగళూరు అండర్‌వరల్డ్’, ‘ధన్ ధనా ధన్’, ‘నన్న కనసిన హూవే’ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

