Homeచిత్ర ప్రభK- Ramp: కిరణ్ అబ్బవరం డబుల్ మీనింగ్ డైలాగ్స్, SKN జవాబులు!

K- Ramp: కిరణ్ అబ్బవరం డబుల్ మీనింగ్ డైలాగ్స్, SKN జవాబులు!

K-Ramp: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘K-ర్యాంప్’ ప్రెస్ మీట్‌లో జరిగిన గొడవ ఇప్పడు బాగా హాట్ టాపిక్ అయ్యింది. సినిమా ట్రైలర్ లో ఉన్న మాటలు, డైలాగ్‌లు బాగోలేవని ఒక రిపోర్టర్ అడగడం, దానికి హీరో, నిర్మాత కలిసి కౌంటర్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

అసలేం జరిగింది?

ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ నేరుగా కిరణ్ అబ్బవరాన్ని అడుగుతూ, “మీ సినిమా ‘K-ర్యాంప్’ ప్రమోషన్స్ మెటీరియల్‌లో డబుల్ మీనింగ్ మాటలు ఎక్కువ ఉన్నాయి. వినోదం పేరుతో బూతు మాటలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?” అని అన్నారు. ఇవే మాటలు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారా అని కిరణ్ ని నిలదీసాడు.

కిరణ్ అబ్బవరం రిప్లై!

ఇది కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో నా క్యారెక్టర్ చాలా మామూలు కుర్రాడిలా ఉంటుంది. వాడు ఎప్పుడూ దేవుడి పాటల్లాంటి భాష మాట్లాడడు కదా. అతను ఆ భాష తన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మాత్రమే వాడతాడు. ఇంట్లో ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంటాడు. మేము చూపించింది ఆ స్నేహితుల మధ్య మాటలే.”
అంటే, సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టే ఆ భాష వాడామని కిరణ్ క్లియర్‌గా చెప్పారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/due-health-issues-veteran-actress-pavala-syamala-joined-in-hospital-looking-for-financial-support/

నిర్మాత SKN ఎంట్రీ !

ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ‘బేబీ’ సినిమా తీసిన నిర్మాత SKN (ఈయన కిరణ్‌తో ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమా కూడా చేస్తున్నారు) రంగంలోకి దిగారు. ఆయన కిరణ్‌కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ, మీడియాను ప్రశ్నించారు.

సినిమా అంటేనే సెన్సార్ అయి వస్తుంది కదా. సెన్సార్ అయ్యాక కూడా ఇంకా మంచి-చెడు (Morals) గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని అన్నారు. కొంతమంది రిపోర్టర్లు బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలనే ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తారు? అని నిలదీశారు. నిజానికి, టీవీల్లో, యూట్యూబ్‌లో బోలెడన్ని బూతులు, వల్గర్ షోలు ఉన్నాయి. ఆ గొప్ప రిపోర్టర్లు వాటి గురించి ఎందుకు ఒక్క మాట కూడా అడగరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఆపాలి అని గట్టిగా చెప్పారు. చివర్లో, ఆ రిపోర్టర్ పద్ధతిని తప్పు పడుతూ… “బ్రో, కూల్‌గా ఉండు. ఇది ఇంటర్వ్యూ, ఎవరినో విచారించే ఇంట్రాగేషన్ సెల్ కాదు” అని క్లోజ్ చేశారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ram-charan-sukumar-combo-movie-update/

మొత్తానికి, ‘K-ర్యాంప్’ ప్రెస్ మీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ సినిమా మీద బజ్ ని ఇంకొంచెం పెంచింది అనే చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News