Friday, March 14, 2025
Homeచిత్ర ప్రభJack: ‘జాక్’ నుంచి 'కిస్' సాంగ్ ప్రోమో రిలీజ్

Jack: ‘జాక్’ నుంచి ‘కిస్’ సాంగ్ ప్రోమో రిలీజ్

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాక్’(Jack)- కొంచెం క్రాక్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సింగిల్ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ నుంచి కిస్ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నువ్వు న‌మ్మాలంటే ఏం చేయాలో చెప్పు.. చేస్తా ‘అంటూ సాగే డైలాగ్‌లే ఉన్నాయి. ఇక ఈ లిరిక‌ల్ సాంగ్‌ను మార్చి 17న ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

- Advertisement -

ఈ చిత్రానికి చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య చైతూ సరసన నటిస్తోంది. ఈ మూవీని బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. డీజే టిల్లు ఫ్రాంచైజీ సినిమాలతో స్టార్ హీరోల లిస్ట్‌లోకి వచ్చిన సిద్ధు.. ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News