Homeచిత్ర ప్రభKollywood Directors: టాలీవుడ్ బాట పట్టిన కోలీవుడ్ దర్శకులు.. కారణం ఇదేనా?

Kollywood Directors: టాలీవుడ్ బాట పట్టిన కోలీవుడ్ దర్శకులు.. కారణం ఇదేనా?

Kollywood Directors: కోలీవుడ్ దర్శకులంతా కూడా ఇప్పుడు టాలీవుడ్ హీరోల మీదే తమ హోప్స్ పెట్టుకుంటున్నారు. రజినీకాంత్ స్పీడ్ తగ్గించడం, దళపతి విజయ్ సినిమాలకు దూరం కావడంతో అక్కడ టాప్ స్టార్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో అక్కడి టాప్ డైరెక్టర్లు మన తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. పైగా మన వాళ్లు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా అందరూ పాన్ ఇండియా వైడ్‌గా ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకున్నారు.

- Advertisement -

ఇక మన వాళ్లతో సినిమా చేస్తే పాన్ ఇండియాగా లాభం ఉంటుందని కోలీవుడ్ దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే బన్నీతో అట్లీ మూవీని ఓకే చేశారు. ఇక ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా బన్నీతోనే సినిమాను ప్లాన్ చేశాడు. ఇక ఎన్టీఆర్‌తో నెల్సన్ మూవీ ఉంటుందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక ప్రశాంత్ నీల్ అయితే టాలీవుడ్‌కే పరిమితం అయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌తోనూ లోకేష్ ప్రాజెక్ట్ ఉంటుందని, ప్రభాస్‌తోనూ సినిమా ఉంటుందని అప్పట్లో గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read – Mega 158: మళ్ళీ సంక్రాంతికి మెగా 158.. మేకర్స్ ప్లాన్ మారిందా?

అయితే ఇప్పుడు మాలీవుడ్, శాండిల్ వుడ్, కోలీవుడ్ దర్శకులు ఎక్కువగా తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ నుంచి చాలా మంది దర్శకులు తెలుగు హీరోలకు స్క్రిప్ట్‌లు చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. మరి ఇక కోలీవుడ్ టాప్ డైరెక్టర్లంతా కూడా టాలీవుడ్‌కి షిప్ట్ అయితే అక్కడి పరిస్థితి ఏంటి? అని అనుకుంటున్నారు.

ఇక మాలీవుడ్ నుంచి కూడా బసిల్ జోసెఫ్ లాంటి దర్శకుడు మన బన్నీతోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మిన్నల్ మురళీ లాంటి సూపర్ హీరో సబ్జెక్ట్‌తో బన్నీని ఒప్పించేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీఫియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని సమాచారం.

Also Read – Yellamma: ‘ఎల్లమ్మ’కి ‘కాంతార’తో పోలిక అంటే.. డీఎస్పీ రేంజ్ పాన్ ఇండియానా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News