Krithi Shetty: డెబ్యూ మూవీ ఉప్పెన తర్వాత కృతిశెట్టికి సరైన హిట్టు లేదు. పెద్ద సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అవకాశాలు బాగానే వస్తోన్న అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌తో ఇప్పటికే టాలీవుడ్‌కు దూరమైంది. కార్తి వా వాథియర్‌తో బ్లాక్‌బస్టర్ అందుకొని కోలీవుడ్‌లో సెటిలవ్వాలని అనుకుంది. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇటీవల సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కార్తి కెరీర్‌లోనే భారీగా నష్టాలు మిగిల్చిన సినిమాగా నిలిచింది.
దక్షిణాదిలో లక్ అంతగా కలిసిరాకపోవడంతో బాలీవుడ్ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది కృతిశెట్టి. ఇటీవలే ఓ ఛాన్స్ కూడా దక్కించుకుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మిలాప్ జవేరీ దర్శకత్వంలో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టిని నిర్మాత ఫైనల్ చేశారట. టైగర్ ష్రాఫ్ సినిమా ద్వారా ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నారట. కానీ డైరెక్టర్ మాత్రం హీరోయిన్‌గా ఈ సినిమాలో కృతిశెట్టి వద్దని.. ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్లు సమాచారం.
Also Read- Jyothi Poorvaj : ఫ్లోరల్ శారీలో జ్యోతి పరువాల విందు.. ఆ టాటూ చూశారా.?
కృతిశెట్టి విషయంలో దర్శకుడితో పాటు నిర్మాత ఇద్దరు తగ్గకపోవడంతో అది కాస్తా అభిప్రాయభేదాలకు దారితీసినట్లు సమాచారం. చివరకు డైరెక్టర్ మిలాప్ జవేరిని ఈ సినిమా నుంచి నిర్మాత తప్పించేశారట. అతడి స్థానంలో మరో కొత్త దర్శకుడితో ఈ సినిమా చేయాలని ఫిక్సైనట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కృతిశెట్టి బాలీవుడ్ డెబ్యూ సినిమా షూటింగ్ మొదలుకాకముందే డైరెక్టర్ తప్పుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందా అన్నది అనుమానంగా మారింది.
కాగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రదీప్ రంగనాథన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు.
Also Read- Sharwanand: మరో సినిమాను ఫిక్స్ చేసిన శర్వానంద్..‘బైకర్’ కొత్త రిలీజ్ డేట్!

