Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ లేటెస్ట్ చిత్రం కాక్‌టెయిల్-2. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతి, మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కృతి తాజాగా ఓ ఇంటర్య్వలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టింది.
లింగ్ వివక్షత ఎక్కువ
ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ చిత్రాలతో బిజీ ఉన్న కృతి తెలుగు సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ‘వన్ నెనోక్కడినే’ మూవీతో టాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసిన ఆది పురుష్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న ఆమె తాజాగా ఇంటర్య్వూలో ఇండస్ట్రీలో లింగ వివక్షపై ప్రస్తావించింది. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా లింగ్ వివక్ష కొనసాగుతుందని చెప్పింది. “ఇండస్ట్రీలో హీరోలకు ఉండే స్టార్‌డమ్ చాలా ప్రత్యేకం. హీరోయిన్ల విషయానికి వస్తే ఎలాంటి గుర్తింపు ఉండదు. సెట్‌లో పురుషులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలం..
తెరపై రాసే పాత్రల విషయంతో పాటు సెట్‌లో పురుష, మహిళా నటీనటులను వేర్వేరుగా చూసే విధానంలో కూడా సినీ పరిశ్రమ పురుషులకే అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నా కెరీర్ ప్రారంభంలో ఇలాంటివీ ఎక్కువగా చూశాను. ఒక మహిళా నటి ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు సెట్‌లో వ్యతిరేకత పెరిగిపోతుంది” అని పేర్కొంది. అనంతరం.. సెట్‌లో దర్శకుడిని ప్రశ్నలు అడగడం తనకు అలవాటని తెలిపింది. ‘ఏదైనా కొత్త విషయం తెలుసుకునే విషయంలో నాకు ఆసక్తి ఎక్కువ. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అలానే నేను ఎదిగాను. నేను నటనలో ఎప్పుడూ శిక్షణ తీసుకోలేదు. ఏమీ తెలియనట్టు ఉండటం కన్నా ప్రశ్నలు అడగడమే మేలు అనుకుంటాను. నేను ఏదైనా సలహా ఇస్తే.. నువ్వు దీన్ని అనవసరంగా విశ్లేషిస్తున్నావు అంటారు.
Also Read: Babu Mohan: అందుకే ఇంతకాలం తిరుమలకు రాలేదు
హీరోలంటే భయం..
సెట్స్‌లో ఉండే మేనేజ్‌మెంట్‌కు హీరోల టైమింగ్స్ అంటే ఒక రకమైన భయం, గౌరవం. అందుకే వాళ్లను షాట్ పెట్టాక పిలుస్తారు. కానీ హీరోయిన్లను మాత్రం ముందే పిలిచి సెట్స్‌లో కూర్చోబెడతారని’ అని చెప్పింది. ‘సెట్‌లో చాలా సందర్భాల్లో హీరోయిన్లకు దక్కాల్సిన ఆత్మగౌరవం, సమానత్వం దక్కదు. చెప్పింది చెయ్ అంటూ అవమానిస్తారు. ఇక హీరోయిన్లు ఏ ఏ ప్రమోషన్లలో పాల్గొనాలి.. ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారు. చివరకు మేం వేసుకునే దుస్తులు కూడా వాళ్లే చెబుతారు. అందుకే హీరోయిన్లకు ప్రాధాన్యత లేని పాత్రలు చేయడానికి తాను ఇష్టపడట్లేదు’ అని కృతి చెప్పుకొచ్చింది.

