Saturday, October 12, 2024
Homeచిత్ర ప్రభKS Ramarao Film Nagar Cultural club new Prez: రసవత్తరంగా ఫిలిం నగర్...

KS Ramarao Film Nagar Cultural club new Prez: రసవత్తరంగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు

అధ్యక్షుడిగా కెఎస్ రామారావు ఘన విజయం..

2024- 2026 టర్మ్ కు సంబంధించిన హైదారాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికలు 29 సెప్టెంబర్ ఆదివారం నాడు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు, జంట నగరాలకు చెందిన అనేక మంది వివిధ రంగాల హేమాహేమీలన మెంబెర్స్ దూరప్రాంతాల నుండి కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

డాక్టర్ కెఎల్ నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు ప్యానల్ నుంచి సినీ నిర్మాత కెఎస్ రామారావు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఈ క్రమంలో కెఎస్ రామారావును ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు మెంబర్లు. ఇక అదే సమయంలో ఉప అధ్యక్షుడుగా ఎస్ ఎన్ రెడ్డి గెలుపొందారు. అలాగే ట్రెజరర్ పోస్టుకు శైలజ జూజాల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. సెక్రటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీగా శివారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కమిటీ మెంబర్లలో సినీ నిర్మాత ఏడిద రాజా అత్యదిక మెజారిటీ తో గెలుపొందారు.

మిగతా కమిటీ మెంబర్లుగా వీ .వీ .జీ .కృష్ణం రాజు( వేణు). కోగంటి భవాని, సీహెచ్ వరప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ప్రమోటీ కమిటీలో కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, బాలరాజు , మురళీ మోహన్ రావు, నవకాంత్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికలు ఒక వేడుకగా రసవత్తరంగా జరుగుతాయి. 31 వ సంవత్సరంలో క్లబ్ ఎంటర్ అయిన సందర్భంగా , ఓ ప్రత్యేక కారక్రమంతో ఈ డిసంబర్ 31 న నిర్వహిస్తామని నూతన అదక్షుడు శ్రీ కే . ఎస్ .రామారావు అనారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News