సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna), తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుబేర’ (Kubera). పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ మూవీలో ధనుష్ తన కెరీర్‌లోనే తొలిసారి బిచ్చగాడిగా, నాగార్జున ధనవంతుడిగా నటిస్తున్నారు. ఇక రష్మిక మధ్య తరగతి అమ్మాయి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు మేకర్స్. జూన్ 20న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు.
