Ranveer Singh : బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మూవీ కుచ్ కుచ్ హోతా హై మూవీకి సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్‌పై దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 1998లో రిలీజైన కుచ్ కుచ్ హోతా హై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షారుఖ్‌ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు నేషనల్ అవార్డులను అందుకుంది. అప్పట్లోనే కుచ్ కుచ్ హోతాపై వంద కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్రను సృష్టించింది. షారుఖ్‌ఖాన్ యాక్టింగ్, కరణ్ జోహార్ టేకింగ్, పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కుచ్ కుచ్ హోతా హై స్ఫూర్తితో పలు భాషల్లో సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి.
ఈ బ్లాక్‌బస్టర్ మూవీకి 27 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌పై ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కరణ్ జోహార్. నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కుచ్ కుచ్ హోతా హైని సీక్వెల్ మాదిరిగా మళ్లీ తెరకెక్కించాలని ఉందని అన్నాడు. “ఒకవేళ కుచ్ కుచ్ హోతా హై 2 చేస్తే…షారుఖ్ ఖాన్ పాత్ర కోసం రణవీర్‌సింగ్‌ను తీసుకుంటా. కాజోల్ పాత్రకు అలియా భట్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. రాణి ముఖర్జీ చేసిన టీనా రోల్ కోసం అనన్యా పాండే, జాన్వీకపూర్, సారా అలీఖాన్‌లలో ఒకరిని సెలెక్ట్ చేస్తా” అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్ జోహార్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. సీక్వెల్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు చెబుతోన్నారు.
ఇదే ఇంటర్వ్యూలో వారసులను ఎక్కువగా ప్రోత్సహిస్తారంటూ తనపై వస్తోన్న విమర్శలపై కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యాడు. “నాతో సినిమాలు చేసిన వారిలో ఎక్కువగా నెపో కిడ్స్ ఉన్నారు. కానీ నేను వారిని ఎప్పుడు అలా చూడలేదు. నెపో కిడ్స్‌తో సినిమాలు చేయమని వారి తల్లిదండ్రులు ఎవరూ కూడా నన్ను కలవలేదు. నాకు నేనుగానే వారితో సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపించాను. టాలెంట్ ఉండటంతో పాటు నా కథలకు తగ్గ నటులను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా. నెపో కిడ్స్‌లో ప్రతిభావంతులు చాలా మందే ఉన్నారు. అంతే కాదు నా ఆఫర్లను తిరస్కరించిన నెపో కిడ్స్ కూడా ఉన్నారని” కరణ్ జోహార్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం రణవీర్‌సింగ్ ధురంధర్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది.

