Homeచిత్ర ప్రభMonalisa: ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.. అసలేమైందంటే!

Monalisa: ప్రియుడితో కలిసి పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.. అసలేమైందంటే!

Monalisa Bhosle: కుంభమేళ వైరల్‌ గర్ల్‌, నటి మోనాలిసా భోంస్లే పోలీసులను ఆశ్రయించింది. తన కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ప్రియుడితో కలిసి కేరళ తిరువనంతపురంలోని తప్పనూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మోనాలిసా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మోనాలిసా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

ఫేస్ బుక్ ప్రేమ.. పెద్దల నిరాకరణ
ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్‌ ఖాన్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఏడాదిన్నర పాటు ప్రేమించుకుంటున్న వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరి పెళ్లికి మోనాలిసా తల్లిదండ్రులు ఏమాత్రం అంగీకారం తెలపడం లేదు. అంతేకాదు వారు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని మోనాలిసాను బలవంతం చేస్తున్నారు. దీంతో ప్రియుడితో ఇంట్లో నుంచి వచ్చేసిన మోనాలిసా బుధవారం (మార్చి 11) కేరళలోని తిరువంతరపురంలోని తప్పనూరు పోలీసు స్టేషన్‌లో తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది.

ప్రియుడితో పెళ్లి జరిపించండి
తన ప్రియుడితో తనకు వివాహం జరిపించాలని, అలాగే తన తల్లితండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని మోనాలిసా తన ఫిర్యాదులు పేర్కొంది. తనకు నచ్చని వ్యక్తితో తన తల్లిదండ్రుల వివాహం చేయాలని నిర్ణయించారని, ఈ పెళ్లి చేసుకోవాలంటూ తనని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపింది. బలవంతపు వివాహం చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందుతున్న మోనాలిసా ఇలా పోలీసులను ఆశ్రయించిన అంశం చర్చనీయాంశమైంది.

Also Read: Hansika Motwani: ఆఫిషియల్‌.. భర్తతో విడిపోయిన హన్సిక, విడాకులు మంజూరు

కాగా కుంభమేళలో పూసలు అమ్ముకుంటున్న ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. ఆమె తెనె కళ్లతో ఆకట్టుకున్న ఈ వైరల్‌ గర్ల్‌కి బాలీవుడ్‌ డైరెక్టర్‌ మూవీ ఆఫర్‌ ఇచ్చాడు. అలా హిందీలో అరంగేట్రం చేసిన మోనాలిసా పలు ప్రైవేట్‌ అల్బం సాంగ్స్‌లోనూ నటించింది. అదే సమయంలో మలయాళంలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు తెలుగులో ఓ సినిమా చేస్తోంది. సాయి చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘లైఫ్’ సినిమాలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News