Homeచిత్ర ప్రభKushboo Sundar: అది నిజం కాదు.. ఎవరూ నమ్మకండి: ఖుష్బూ

Kushboo Sundar: అది నిజం కాదు.. ఎవరూ నమ్మకండి: ఖుష్బూ

Khushbu Sundar: సెలబ్రిటీలకు సంబంధించిన అప్‌డేట్స్‌ కావాలంటే ముందుగా చూడాల్సింది సోషల్‌ మీడియానే. ఎలాంటి ప్రకటన చూడాలన్న వారి అకౌంట్స్‌ విజిట్‌ చేస్తే చాలు. ఇక సెలబ్రిటీలు కూడా సామాజిక మాధ్యమాలను తమ అభిమానులతో కలిపే వారథిగా చూస్తుంటారు. కానీ, కొందరు మాత్రం దీనిని అడ్వంటేజ్‌గా తీసుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు. సెలబ్రిటీల పేరుపై ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి నెటిజన్స్‌ నుంచి డబ్బులు గుంజుతున్నారు.

- Advertisement -

సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్స్
ఇప్పటికే ఎన్నో సంఘటనలు వెలుగు చూశాయి. తరచూ ఏదోక దగ్గర సెలబ్రిటీల పేరుతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి వారి పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అది నమ్మి చాలామంది తమ జేబులు ఖాళీ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి వాటిని నుంచి సీనియర్‌ నటి ఖుష్బు అభిమానులను అప్రమత్తం చేశారు. తన భర్తపై ఉన్న ట్వీటర్‌ అకౌంట్‌పై ఆమె క్లారిటీ ఇచ్చారు.

అది నిజం కాదు..
నటి కుష్బూ భర్త సుందర్‌ సి అని తెలిసిందే. కోలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఆయన. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో చిత్రాలు మంచి విజయం సాధించాయి. డైరెక్టర్‌ మాత్రమే కాదు మంచి నటుడు కూడా. ఆయన స్వీయ దర్శకత్వలో లీడ్‌, సపోర్టు రోల్స్‌ పోషిస్తుంటారు. స్టార్‌ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయనకు ఇప్పటి వరకు ఆఫీషియల్‌గా ఎలాంటి సోషల్ మీడియాలో అకౌంట్‌ లేదు. కానీ, సడెన్‌గా ఆయన పేరుతో ఓ ట్విటర్‌ అకౌంట్‌ పుట్టుకొచ్చింది. ఇది సుందర్‌ సిదే అనుకోని అభిమానులంత ఆయన అకౌంట్‌ ఫాలో అవ్వడం ప్రారంభించారు.

అయితే, అది నిజమైన అకౌంట్‌ కాదని, ఈ ఫేక్‌ అకౌంట్‌తో జాగ్రత్త అంటూ ఆయన భార్య, నటి ఖుష్బూ తాజాగా ప్రకటన ఇచ్చారు.  సుందర్‌ సి పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. “నా భర్త పేరు మీద ఉన్న ఈ అకౌంట్ పూర్తిగా ఫేక్. ఇప్పటివరకు ఆయనకు సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లేవు. నా భర్త పేరు మీద వచ్చే అకౌంట్లను ఎవరు నమ్మొద్దు. ఆ అకౌంట్‌ పూర్తిగా ఫేక్” అని తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఆయన పేరుతో కొత్త అకౌంట్‌ క్రియేట్‌ చేయనున్నట్లు చెప్పారు.

Also Read: Rahul Arunoday: షూటింగ్‌లో ప్రమాదం.. హీరో మృతి

ఎమ్మెల్యేగా పోటీ
ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ఖుష్బూ.. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంది. మొదట్లో డీఎంకేలో చేరింది. నాలుగేళ్లకే ఆ పార్టీని వదిలి కాంగ్రెస్‌లో అడుగుపెట్టింది. ఆరేళ్లకే కాంగ్రెస్‌ను సైతం వీడి బీజేపీలో చేరింది. 2025లో ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఇదిలా ఉంటే త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో ఖుష్బూ భర్త సుందర్‌. సి సైతం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే కూటమి మిత్రపక్షమైన పుతియ నీది కట్చి (Puthiya Neethi Katchi (PNK) పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. మధురై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News