మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘లైలా'(Laila). విడుదలకు ముందే ఫుల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంది. వైసీపీ అభిమానులు అయితే ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కాంట్రవర్సీల మధ్య వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా విశ్వక్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ చూస్తే ఇంత దారుణమా అనిపిస్తుంది. ఇవాళ తొలి రెండు ఆటలకు కలిపి కేవలం రూ.7లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చాయి. దీంతో సినిమా ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేదని అర్థమవుతోంది.
మూవీ ఫస్ట్ డే కోటి 40 లక్షలు రాగా.. 2వ రోజు రూ.60 లక్షలు, 3వ రోజు రూ.65 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో కేవలం 2 కోట్ల 72 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. దీంతో సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఈ మూవీ బడ్జెట్ రూ.30కోట్లుగా చిత్రబృందం తెలిపింది. మొత్తానికి నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తమ పార్టీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వైసీపీ అభిమానులు చెబుతుంటే.. సినిమాలో అసలు కంటెంట్ లేకపోవడంతోనే ప్రేక్షకులకు నచ్చలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.