Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభK. S. Chithra: ఎయిర్‌పోర్ట్‌లో గాన కోకిల చిత్రకు చేదు అనుభవం.. ప్ర‌మాదానికి దారి తీసిన...

K. S. Chithra: ఎయిర్‌పోర్ట్‌లో గాన కోకిల చిత్రకు చేదు అనుభవం.. ప్ర‌మాదానికి దారి తీసిన అభిమానుల ప్రేమ

Legendary Singer: కె.ఎస్‌.చిత్ర.. సంగీతాన్ని ప్రేమించి ప్రతి హృదయంలో కొలువై ఉన్న గాన కోకిల. ఆమె గాత్రానికి మైమరచిపోనివారు ఉండరు. దశాబ్దాలుగా వేల పాటలు పాడి శ్రోతల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నలెజెండ్రీ సింగ‌ర్‌. ఈమె గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈ స్టార్ సింగర్ భుజానికి గాయం కావ‌టం, చేతికి కట్టుతో కనిపించడం అభిమానులను కలవరపెట్టింది. ఆమె ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? అభిమానుల ఉత్సాహం ప్రమాదానికి ఎలా దారితీసిందనే విష‌యాన్ని ఆమె స్వయంగా తెలియ‌జేశారు.

- Advertisement -

కె.ఎస్‌.చిత్ర భుజానికి గాయ‌మైన‌ట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చినప్ప‌టికీ పూర్తి వివరాలు వెల్లడికాకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ క్రమంలో, ఆసియా నెట్ స్టార్ సింగర్ వేదికపై చిత్ర ఈ ఘ‌టన గురించి వివరించారు. కింద పడిపోవడం వల్ల భుజానికి గాయం అయ్యిందని ఆమె తెలిపారు. హైదరాబాద్ వెళ్లడానికి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో (Chennai Airport) ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందని చిత్ర చెప్పారు. సెక్యూరిటీ చెక్ అయ్యాక, తన భర్త కోసం ఎదురుచూస్తున్న సమయంలో, చాలా మంది అభిమానులు నన్ను చూసి ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు. అందరూ ఒకేసారి వచ్చేసరికి అక్కడ జన సందోహం నియంత్రించలేని స్థితికి చేరింది. అదే సమయంలో అక్కడే ట్రేను నాతో ఫోటో తీసుకునే ఉత్సాహంలో ఎవరో దానిని ఆమె కాలి వెనక్కి నెట్టి వెళ్లిపోయారు. ఆమె చూసుకోకుండా వెన‌క్కి తిరిగిన‌ప్పుడు కాలు ఆ ట్రేకు తగిలి బ్యాలెన్స్ తప్పి చిత్ర‌ పడిపోయారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/senior-tollywood-heroes-changed-their-script-selection/

ఈ ప్రమాదం వ‌ల్ల‌ తన భుజం ఎముక దాదాపు ఒకటిన్నర అంగుళాలు కిందకి జరిగిందని, డాక్టర్లు దానిని తిరిగి సరిచేశారని చిత్ర పేర్కొన్నారు. అయితే, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని, మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించినట్లు కూడా ఆమె తెలిపారు. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని స్థానాన్నిసంపాదించుకున్న కె.ఎస్.చిత్రగారు ఇప్పుడు చేతి కట్టుతో కనిపించటంపై అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండి, ముందు ముందు కూడా మంచి మంచి పాటలతో అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే చిత్ర‌ అన్ని భాషల్లో కలిపి దాదాపు 20 వేలకు పైగా పాటలు పాడారుల. చిత్ర గారు త్వరగా కోలుకొని, మళ్లీ తన మధురమైన గానంతో శ్రోతలను అలరించాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News