Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభLokesh Kanagaraj: హీరోగా డెబ్యూ మూవీ కోసం షాకింగ్ రెమ్యూన‌రేష‌న్ - లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌గ్గేదేలే

Lokesh Kanagaraj: హీరోగా డెబ్యూ మూవీ కోసం షాకింగ్ రెమ్యూన‌రేష‌న్ – లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌గ్గేదేలే

Lokesh Kanagaraj: ఖైదీ, విక్ర‌మ్‌, లియో… సినిమాల‌తో కోలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఈ యాక్ష‌న్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను తిర‌గ‌రాశాయి. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో లోకేష్ పేరు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మారుమోగింది. అత‌డితో సినిమాలు చేసేందుకు తెలుగు స్టార్ హీరోలు సైతం ఆస‌క్తిని చూపించారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ గ‌త సినిమా కూలీ మాత్రం అంచ‌నాల‌కు అందుకోలేక‌పోయింది. యావ‌రేజ్‌గా నిలిచింది. కూలీ త‌ర్వాత మెగాఫోన్‌కు బ్రేక్ ఇచ్చిన లోకేష్ క‌గ‌న‌రాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. డీసీ పేరుతో ఓ క్రైమ్ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వామికా గ‌బ్బి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -

ఇటీవ‌ల డీసీ టైటిల్‌తో పాటు ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌తో హీరోగా అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. దేవ‌దాస్ అనే క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టాడు. కాగా తాను హీరోగా న‌టిస్తున్న ఈ డెబ్యూ మూవీ కోసం లోకేష్ క‌న‌గ‌రాజ్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డీసీ మూవీ కోసం లోకేష్ ఏకంగా 35 కోట్ల రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేశాడ‌ట‌. స్టార్ హీరోల‌కు ధీటుగా లోకేష్‌కు క్రేజ్ ఉండ‌టంతో అత‌డు అడిగినంత మొత్తాన్ని నిర్మాత‌లు ఇచ్చార‌ట‌.

Also Read – Panchaka Yoga: 17 ఏళ్ల తర్వాత సూర్య ప్రభావంతో అత్యంత శక్తివంతమైన యోగం

ద‌క్షిణాదిలో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ అందుకున్న డెబ్యూ హీరోగా డీసీతో లోకేష్ క‌న‌గ‌రాజ్ రికార్డ్ క్రియేట్ చేశాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. డైరెక్ట‌ర్‌గా ఒక్కో సినిమాకు యాభై కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుంటూ వ‌చ్చాడు లోకేష్‌. కూలీ ప్ర‌మోష‌న్స్‌లో త‌న రెమ్యూన‌రేష‌న్ గురించి స్వ‌యంగా అత‌డే వెల్ల‌డించాడు. హీరోగా కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా అదే స్థాయిలో పారితోషికం స్వీక‌రించ‌డం త‌మిళ‌నాట‌ హాట్ టాపిక్‌గా మారింది. డీసీ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

డైరెక్ట‌ర్‌గా కూలీ త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ హీరోలుగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ కూలీ రిజ‌ల్ట్ ఎఫెక్ట్‌తో లోకేష్‌ను ప‌క్క‌న‌పెట్టి నెల్స‌న్‌తో ఈ సినిమా చేయాల‌ని క‌మ‌ల్‌హాస‌న్ ఫిక్సైన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణ‌యంతో హ‌ర్ట్ అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌ల‌ను సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేసిన‌ట్లు చెబుతున్నారు.

Also Read – Kalabhairava Jayanti: నేడే కాలభైరవ జయంతి..ఈ పరిహారాలు పాటిస్తే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad