Homeచిత్ర ప్రభMahesh Babu: మహేష్‌ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫోటో వైరల్‌

Mahesh Babu: మహేష్‌ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫోటో వైరల్‌

Mahesh Babu: శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన ఫోటో బయటకు వచ్చింది. ఓ గుడిలోని రాముడి విగ్రహం అచ్చం టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పోలీకలతో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఈ రాముడి విగ్రహం ఉందంటూ ఓ నెటిజన్‌ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అంత ఈ ఫోటో గురించే చర్చించుకుంటున్నారు.

- Advertisement -

అచ్చం మహేష్ బాబులా
ఓ నెటిజన్‌ శ్రీరాముడి విగ్రహం షేర్‌ చేస్తూ.. ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్‌ బాబులాగే కనిపిస్తున్నాడు కదా’ అంటూ షేర్‌ చేశాడు. ఈ విగ్రహం అచ్చం మహేష్‌ బాబు పోలికలతో ఉండటం విశేషం. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశమైంది. ఇది నిజమైన ఫోటోనా లేక ఏఐ అని సందేహంలో పడ్డారు. సదరు నెటిజన్‌ చెప్పినట్టు నిజంగానే ఈవిగ్రహం ఉంటే ఈపాటికే వైరల్‌ అయ్యేదని, 15 ఏళ్ల క్రితం అయితే.. ఇప్పటికే ఇది వార్తల్లో నిలిచేదంటున్నారు.

మరికొందరు ఇది ఖచ్చితంగా ఏఐ క్రియేషన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వ్యూస్‌ కోసం, సోషల్‌ మీడియా అటెన్షన్‌ కోసం ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదంటూ సదరు వ్యక్తిపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేశ్‌ అభిమానులు అయితే.. శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు. అయితే సదరు నెటిజన్‌ ఆ విగ్రహం ఉన్న గుడి పేరు చెప్పకుండా ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్‌ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని పోస్ట్‌ పెట్టడంతో.. అది నిజమైన విగ్రహం కాదేమో అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

ఏఐ మాయ?
ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్‌ చేస్తున్నారు. కేవలం వ్యూస్‌, రీచ్‌ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్‌ చేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్స్‌ మండిపడుతున్నారు. మరోవైపు మహేశ్‌ అభిమాను మాత్రం శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు. మరికొందరు ఈ విగ్రహానికి సంబంధించి ఒరిజినల్‌ ఫోటో షేర్‌ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఏఐ మాయే అని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్‌ బాబు వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్‌ఎస్‌ రాజమౌలి దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇందులో మహేష్‌ సరసన గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read: Bellamkonda Srinivas: తిరుపతిలో సింపుల్‌గా బెల్లంకొండ హీరో పెళ్లి.. ఎప్పుడంటే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News