Thursday, March 5, 2026
Homeచిత్ర ప్రభAnantha Sriram: 'రై రై రారా' పాట రాస్తున్నప్పుడు ఛాలేంజింగ్‌గా అనిపించింది.. అనంత్‌ శ్రీరామ్

Anantha Sriram: ‘రై రై రారా’ పాట రాస్తున్నప్పుడు ఛాలేంజింగ్‌గా అనిపించింది.. అనంత్‌ శ్రీరామ్

Anantha Sriram: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, గ్లింప్స్‌, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. వందకు పైగా మినియన్ల వ్యూస్ యూట్యూబ్ ని షేక్‌ చేసింది. ఇక ఇటీవల విడుదలైన రై రై రారా పాట కూడా అదే స్థాయిలో ఆదరణ అందుకుంటోంది. ప్రస్తుతం రికార్డింగ్ బ్రేక్‌ వ్యూస్‌తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

రామ్ చరణ్ గ్రేస్, చరిష్మా, ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్‌ బుచ్చిబాబు అద్భుతమైన పిక్చరైజేషన్‌, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, అనంత శ్రీరామ్ లిరిక్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ సాంగ్ వైరల్ హిట్ గా అదరగొడుతోంది. ఇక ఈ చిత్రం ఏప్రిల్ ౩౦ వరల్డ్‌ వైడ్‌ విడుదల కానున్న నేపథ్యంలో సెకండ్‌ సింగిల్ లిరిక్ రైటర్‌ అనంత్‌ శ్రీరామ్‌ వీలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పెద్ది మూవీతో పాటు రై రై రారా పాట విశేషాలను పంచుకున్నారు. పెద్ది విశేషాలు, రై రై రారా పాట సక్సెస్‌ని ఆయన మాటల్లోనే చూద్దాం.

‘రై రై రా రా’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది?
“ఈ పాట ఈ పెద్ద సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. రామ్‌ చరణ్ రుద్రతాండవం, ఏఆర్‌ రెహమాన్ ధీర శంఖారావం, రత్నవేలు చిత్రీకరణలో ఉన్న మాయజాలం వీటన్నిటి మధ్యలో నుంచి కూడా పాటలో లిరిక్స్‌ బాగున్నాయి. ఫలానా లైన్ విను, ఫలానా లైన్‌ బాగుందని అన్ని చోట్ల సాహిత్యానికి ప్రశంసలు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట అంత అదృష్టాన్ని చేసుకుందనిపించింది.

నిజానికి ఇది ఒక ప్రేమ పాట కాదు, ఐటెం సాంగ్ కాదు అయినప్పటికీ కూడా లైన్స్ గురించి మాట్లాడుతున్నారు.. దీనికి కారణం ఈ పాట సాహిత్యం ఇలా రావాలన్న దర్శకుడి సంకల్పం. బుచ్చిబాబు సాహిత్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ పాటలో ఎలాంటి సాహిత్యం కోసం నేను, డైరెక్టర్ చాలా సమయం కేటాయించాం. ఎన్నో రాత్రులు రింగ్ రోడ్డు మీద అలా డ్రైవ్ చేస్తూ, కాఫీ షాపుల్లో కూర్చుని చర్చించాం. అలా నెలలు తరబడి మదనపడితే వచ్చిన పాట ఇది. ఈ తరానికి ముందు తరానికి కూడా గొప్ప సందేశాన్ని అందిస్తూనే మాస్ ని అలరించేలా ఈ పాటని రూపొందించాం.

సాహిత్యంలో మిత్ర సంహిత ప్రక్రియలో పాట రాయాలని అనుకున్నాను.
నిన్నటి లాగే
రేపు ఉన్నదంటే
ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే .. ఈ లైన్స్ ఒక స్నేహితుడు మరో స్నేహితుడితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది.

యూత్ కి యాంథమ్ లా..
ఈ పాట యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలి అని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పారు. ఆ మాట నాకు తారకమంత్రంలా పనిచేసింది. సాహిత్యంలో శ్రీశ్రీ గారి గేయ ప్రక్రియలా ఉంటే సరిపోతుందని భావించాను. అందుకే రైరై రారా పాటని ఒక గేయ కవితలాగా రాశాను. శ్రీశ్రీ గారి కవితలు చదువుతున్నప్పుడు ఎలాంటి ఉద్వేగం ఉంటుందో అలాంటి ప్రాసలతో ఈ పాట రాశాను.

హీరోకి కెప్టెన్ లక్షణాలు ఉన్నాయని ఈ పాటతో చూపించాలి. తన జట్టు ఆటగాళ్లని రై రారా అని పిలిచేలాగా ఉండాలి. బుచ్చిబాబు చెప్పిన ఈ మాటలు ఆయన దగ్గర నుంచే తీసుకుని పాటని ప్రారంభించాను. రై రై రా రా అని పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక ఫిలాసఫీగా రీచ్ అవ్వాలి. మన పల్లెటూరులో ప్రతి ఒక్కరిలో ఉపయోగించే రవాణా సౌకర్యం ఆర్టిసీ బస్సు. కండక్టర్ రైరై అనగానే బండి ముందు కదులుతుంది. ఆ శబ్దం ఒక ప్రేరణలా ఈ జీవితమనే బస్సు ముందుకు వెళ్లాలి అన్న సూచన ఇచ్చేలాగా పాటను మొదలుపెట్టాను. ఇందులో ఎక్కువమంది పాతేసుకోకోయలా.. నువ్వు నిన్నే నీ లోపల.. పాతికేళ్లకే..నువ్వు పాతబడిపోకురా.. ఈ లైన్ ని కోట్ చేస్తున్నారు. అంత మంచి పాట ఇంత పెద్ద సినిమాలో రాసిన అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.

క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే
సాహిత్యం ఒక్కటే కాదు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు గారికి విజువల్స్, రామ్ చరణ్ గారు చూపించిన చరిష్మా గ్రేష్, రెహమాన్ సంగీతం, గొంతు అన్నీ నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడడం వల్లే ఈ పాటకు ఇంతటి రెస్పాన్స్‌ వచ్చిందని నమ్ముతున్నా. ఈ పాట క్రెడిట్ అందరికీ ఇవ్వాలి. అలా కాదు ఒక్కరికే ఇవ్వాలి అంటే మా అందరినీ నడిపించిన డైరెక్టర్ బుచ్చిబాబుకి ఇవ్వాలి.. ఆయనకి స్వేచ్ఛనిచ్చిన రామ్ చరణ్ గారికి ఇవ్వాలి” అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ పాట విన్న తర్వాత హీరో రామ్‌ చరణ్ రియాక్షన్ ఏంటి?
రామ్‌ చరణ్‌ ఈ సాంగ్ విషయంలో పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. షూటింగ్ లోకేషన్ లో ఈ పాటను చరణ్ వినిపించాను. పాట విని నన్ను హత్తుకున్నారు.

ఈ సాంగ్ మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందా?
ఒక మంచి పాట రాయడం.. అలాగే మాస్ పాట రాయడం రెండూ కష్టం కాదు. మాస్ పరిభాషలో ఫిలాసఫీ చెప్పడం అనేది కత్తి మీద సాములా అనిపించింది. అందులోనూ రెహమాన్ గారి బాణీ మామూలుగా ఉండవు. ప్రతి లైన్ ప్రయోగాత్మకంగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను. ఈ పాట రాయడానికి చాలా కసరత్తు జరిగింది. దాదాపు రెండు నెలల వరకు సమయం తీసుకున్నా. పరాయి భాషల ప్రభావం లేని అచ్చ తెలుగు పాటిది అన్నారు.

ఈ పాట మీకు ఎలాంటి తృప్తిని ఇచ్చింది?
నా పాట విని ఆత్మహత్యను విరమించుకునే సందర్భము రావాలి. అలాంటి పాట రాస్తే నా రచన సార్థకమైనట్లే అని చెప్తుంటాను. ఆ లక్షణం ఈ పాటకి కనిపిస్తోంది.

ఇందులో మీరు రాసిన పాటలు ఇంకా ఉన్నాయా?
మూడు పాటలు రాబోతున్నా యి. బాలాజీ రాసిన చికిరి, ఈపాట ఎంత వైవిధ్యంగా ఉన్నాయో.. మిగతా పాటలు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి.

ఇండస్ట్రీకి వచ్చి 20 పూర్తయ్యింది.. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?
20 ఏళ్ల ప్రస్థానంలో నేను తెలుసుకున్నది ఏమిటంటే ..అవకాశం రావడం కష్టం, అవకాశం వచ్చిన తర్వాత మొదటి విజయం రావడం కష్టం. విజయాలను కొనసాగించడం ఇంకా కష్టం. ప్రతి సంవత్సరం ఒక చార్ట్ బస్టర్ హిట్ వస్తుందంటే.. అది తల్లి తండ్రులు వేసిన పునాది. ఎప్పటికప్పుడు నన్ను నేను కొత్తగా మార్చుకోవాలి అనే తపన. ఈ నిలకడే నేను సాధించిన విజయంగా భావిస్తున్నాను. షేర్స్, లైక్స్, వ్యూస్.. ఇలా విజయానికి కొలమానాలు ట్రెండ్ ని బట్టి మారుతుంటాయి.. కానీ నిలకడ మాత్రం మనం కొనసాగిస్తూ ఉండాలి.

మెగా ఫ్యామిలీతో మీ అసోసియేషన్ ఎలా ఉంది?
పాటల రచయితగా తొలిసారి నా పేరు చూసుకున్న తొలి చిత్రం చిరంజీవి గారి అందరివాడు. ఒకే హీరోతో ప్రయాణం అనేది గొప్ప అదృష్టం. రెండో తరం హీరోతో కూడా అంత మంచి పాట రావడం అనేది ఇంకా అదృష్టం. మరో అద్భుతమైన అదృష్టమేమిటంటే.. ఒకే సంవత్సరంలో చిరంజీవి గారి సినిమా, అలాగే ఆయన అబ్బాయి రామ్ చరణ్ గారి సినిమా.. ఇలా రెండు పెద్ద హిట్స్ రావడం అనేది గొప్ప అదృష్టం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News