Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభMaddy look: మాధవన్ న్యూ లుక్ చూశారా ? యాంటీ ఏజింగ్ సీక్రెట్ చెప్పమని పోస్టులు

Maddy look: మాధవన్ న్యూ లుక్ చూశారా ? యాంటీ ఏజింగ్ సీక్రెట్ చెప్పమని పోస్టులు

హీరో మాధవన్ ఎప్పుడూ ఎంత యంగ్ గా ఉంటారో మనందరికీ తెలుసు. లేటెట్స్ గా ఆయన మరింత యంగ్ లుక్ లో కనిపించటం విశేషం. తన కొత్త ప్రాజెక్ట్ కోసం ఆర్ మాధవన్ ఈ కొత్త గెటప్ లో కనిపించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆయన్ను యంగ్ లుక్ లో ఉన్న సీక్రెట్ ఏంటని తెగ విసిగించేస్తున్నారు.

- Advertisement -

ఓవైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లోనూ బిజీ స్టార్ గా ఆయన కొనసాగుతున్నారు. మధ్యలో ఓటీటీ కంటెంట్ తోనూ ఆయన బిజీ. 52 ఏళ్ల మాధవన్ ఎప్పటికప్పుడు గెటప్స్ మార్చుతూ, తన ఫాలోయర్స్ కోసం ఆ పిక్స్ షేర్ చేస్తుంటారు. న్యూ ప్రాజెక్ట్, న్యూ లుక్ .. సూపర్ ఎగ్జైటెడ్ అంటూ ఆయన ఫోటో రైటప్ ఇచ్చేశారు కూడా. అయితే “ఈ న్యూ లుక్ స్టన్నింగ్ గా ఉందని, ఆ యాంటీ-ఏజింగ్ సీక్రెట్ ఏదో మాకూ చెప్పరాదా?” అని ఒకటే కామెంట్స్ పోస్ట్ చేసేస్తున్నారు నెటిజన్స్.

మరికొందరైతే “మ్యాడీ కొన్నేళ్లుగా నిన్ను ఆ గడ్డం లేకుండా అస్సలు ఒక్కసారి కూడా చూడలేదు భలే ఉన్నావ్” అని రియాక్ట్ అయ్యారు. ఒక యూజర్ అయితే.. “మ్యాడీ సర్, ఏటా యంగర్ కావటం ఎలా అనే సీక్రెట్ సగం అయినా చెప్పండి ప్లీజ్” అనటం మరో హైలైట్. కొందరైతే ఇక గెస్సింగ్ గేమ్ మొదలుపెట్టి అర్థమైపోయింది ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం ఇలా రెడీ అయ్యారంటున్నారు. మ్యాడీ ఈ పిక్ షేర్ చేసిన ఒక్క రోజులో కనీసం 1.8 మిలియన్ మంది దీన్ని చూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News