Jana Nayagan: దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’ ఇప్పట్లో రిలీజయ్యేలా లేదు. ఈ రోజు ఉదయం మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డుని సర్టిఫికేట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అని అందరూ భావించారు. అయితే సెన్సార్ బోర్డ్ వెంటనే హైకోర్ట్ డివిజన్ బెంచ్‌కు రిట్ పిటిషన్ వేసింది. ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికేట్ రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. సెన్సార్ సర్టిఫికేట్‌ను జారీ చేయటంపై తాత్కాలికంగా స్టేను విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. దీంతో విజయ్ సినిమా ఇక సంక్రాంతికి రావటం లేదనేది ఫిక్స్. మరి జనవరి 21కైనా కోర్టు సెన్సార్ సర్టిఫికేట్‌ను ఇవ్వటంపై స్టే ఎత్తేస్తుందో లేదో చూడాలి.
Also Read – Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట నారాయణ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కావాల్సింది. సెన్సార్ పూర్తైనప్పటికీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రివ్యూ కమీషన్‌కు పంపింది. ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా సింగిల్ బెంచ్ సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ బోర్డుని ఆదేశించిది. అయితే ఈ ఆదేశాలపై సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌కు వెళ్లటంతో వారు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా స్టే విధించారు.
‘జన నాయగన్’ చిత్రం తెలుగులో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు తమిళ రీమేక్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. ప్రకాష్ రాజ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
Also Read – Parasakthi Censor: ‘పరాశక్తి’కి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్..

