Tamanna: పవర్ సోప్స్ కంపెనీపై హీరోయిన్ తమన్నా దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తన ఆరోపణలకు సంబంధించి తగిన సాక్ష్యాలు చూపకపోవడంతో తమన్నా పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 2008లో తమ బ్రాండ్ ప్రమోషన్స్ కోసం పవర్ సోప్స్ కంపెనీ తమన్నాతో ఒప్పందం చేసుకుంది.
ఈ అగ్రీమెంట్ ప్రకారం.. 2009 వరకు మాత్రమే తమన్నా ఫోటోలతో పవర్ సోప్స్ ప్రచారం చేసుకోవాలి. కానీ, గడువు సమయం ముగిసినప్పటి పవర్ సోప్స్ 2010-2011 మధ్య కూడా తమన్నా ఫోటోలు, పేరును అనధికారంగా వాడుకున్నారని తమన్నా ఆరోపించింది. ఇందుకు గానూ సదరు సంస్థ నుంచి రూ. కోటి నష్టపరిహారం డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. అలాగే భవిష్యత్తులో సదరు సంస్థ తన ఫోటోలు వాడకుండ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: నేను కూడా బాధితురాలినే.. నేను ఏ తప్పు చేయలేదు: మంగ్లీ
సాక్ష్యాలు ఎక్కడ
అయితే తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి బెంచ్.. సంస్థపై చేసిన ఆరోపణలకు సంబంధించి తమన్నా తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొంటూ గతంలోనే పిటిషన్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్‌ను విచారించిన జస్టిస్ పి. వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ ఆమె పిటిషన్‌ని శాశ్వతంగా కొట్టివేసింది.

